AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన 8 కొత్త సీఎన్జీ కార్లు..! వీడియో..

Fire accident in Tupran: మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని NH-44పై భారీ అగ్నిప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కంటైనర్ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కంటైనర్‌లో తరలిస్తున్న 8 మారుతీ కార్లు పూర్తిగా కాలిపోయాయి.

ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన 8 కొత్త సీఎన్జీ కార్లు..! వీడియో..
Cars Fire Accident
P Shivteja
| Edited By: |

Updated on: May 21, 2026 | 8:44 PM

Share

మెదక్: తూప్రాన్ వద్ద NH 44పై అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్ లారీలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో కంటైనర్‌లోని 8 మారుతీ కార్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా తూప్రాన్ 44వ జాతీయ రహదారిపై ఈరోజు మధ్యాహ్నం నాగులపల్లి చౌరస్తా వద్ద ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

నాగపూర్ నుంచి మారుతి సుజుకి కంపెనీకి చెందిన 8 కార్లను కంటైనర్‌లో తీసుకుని కాకినాడ పోర్ట్‌కి బయలుదేరింది. కాగా నాగులపల్లి చౌరస్తాలోకి రాగానే కంటైనర్ ఇంజిన్లో మంటలు చెలరేగాయి. అవి ఒకేసారి భారీగా వ్యాపించి పూర్తిగా కంటైనర్ దగ్ధం అయ్యింది. దీంతో అదే కంటైనర్‌లో ఉన్న 8 కొత్త కార్లు (మారుతి సుజుకి) పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో అగ్ని శకలాలు హైవేపై ఎగిసిపడడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. మరో వైపు భారీగా దట్టమైన పొగలు వ్యాపిచాయి. ఈ అగ్ని ప్రమాదంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు.

కార్లు దగ్ధమవుతున్న వీడియో..

Follow Us