స్పైసీగా మటన్ కూర తినాలంటే ఇలా చేస్తే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
స్పైసీగా మటన్ కూర
మరి, ఇంకెందుకు లేట్ ఇక్కడ ఎలా చేయాలో చదివి తెలుసుకుందాం..
మటన్ కూర
ముందుగా అర కిలో మటన్‌ను తీసుకుని బాగా కడిగిన దానిలో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కూడా వేసి అరగంట పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ - 1
ఇంకా ఈ ప్రెషర్ కుక్కర్‌లో ఆయిల్ వేసి నాలుగు బిర్యానీ ఆకు, రెండు లవంగాలు, మూడు యాలకులు, దాల్చినచెక్కలు వేసి బాగా వేయించాలి.
స్టెప్ - 2
ఆ తర్వాత నాలుగు ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు కలర్ లోకి మారే వరకు బాగా వేయించాలి.
స్టెప్ - 3
ఇంకా పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఆకులు వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి.
స్టెప్ - 4
ఇప్పుడు ఒక కప్పు టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా పొడులు వేసి ఆయిల్ పైకి తేలే వరకు వేయించాలి.
స్టెప్ - 5
మటన్ ముక్కలు వేసి మసాలాలు బాగా పట్టేలా 10 నిమిషాలు ఉంచి దించే ముందు కొత్తిమీరను వేసి దించడమే.