Fire Accident: నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం.. అధికారులు అప్రమత్తం.. తప్పిన పెను ప్రమాదం..
Fire Accident: నల్గొండ జిల్లాలో గల నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రంలో అగ్రి ప్రమాదం సంభవించింది.
Fire Accident: నల్గొండ జిల్లాలో గల నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రంలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ ఉత్పాదన కేంద్రంలో మంటలు చెలరేగాయి. విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో జలవిద్యుత్ కేంద్రం వెలుపల ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి మంటలు ఎగసిపడ్డాయి. ఇది గమనించిన అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. మంటలను అదుపు చేశారు. దాంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. మంటలు అదుపులోకి రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవల శ్రీశైలంలోని ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మంటలు భారీగా వ్యాపించడంతో పాటు దట్టమైన పొగ కమ్ముకోవడంతో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.
Also read: