Tadipatri High Tension : తాడిపత్రిలో హైటెన్షన్.. దీక్షకు అనుమతి లేదంటున్న పోలీసులు.. భయపడేది లేదంటున్న జేసీ బ్రదర్స్
అనంతపురం తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది . నేడు ఆమరణ దీక్షకు జేసీ బ్రదర్స్ .దాంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని..

అనంతపురం తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. నేడు ఆమరణ దీక్షకు జేసీ బ్రదర్స్ .దాంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే తాహశీల్దార్ కార్యాలయం ఎదుట జేసీ సోదరుల ఆమరణ దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో 144 సెక్షన్ విధించారు.
జేసీ బ్రదర్స్ , ఎమ్మెల్యే పెద్ది రెడ్డి ఇంటిదగ్గర పోలీసులు కవాతు నిర్వహించారు. సభలు, సమావేశాలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. మరో వైపు పోలీసులు అరెస్ట్ చేసిన దీక్షచేస్తామంటన్నారు జేసీ బ్రదర్స్. జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు కవాతు చేసిన భయపడనన్నారు. శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. అలాగే చావో రేవో తేల్చుకుందామని 70 ఏళ్ళ పైబడిన వారిని దీక్షకు కదిలి రావాలని కోరారు జేసీ దివాకర్ రెడ్డి. తాడిపత్రికి నాలుగువైపులా వచ్చే మార్గాల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రధాన వీధుల్లో దుకాణాలను బంద్ చేయిస్తున్నారు. బయట వ్యక్తులు తాడిపత్రి పట్టణంలోకి రాకుండా చూస్తున్నారు.
also read : Petrol-Diesel Price Today: పెరగని డీజిల్, పెట్రోల్ రేటు… నగరాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధర…