Andhra News: జైలర్ గారి గూడు పుఠాణి.. పెద్దాపురంలో ఉన్నప్పుడు పిచ్చివేశాలు వేశాడుగా…
అనంతపురం జైలర్ వేధిస్తున్నాడంటూ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేయడం ఏపీలో సంచలనంగా మారింది. ఆన్‌లైన్‌లో న్యూడ్ కాల్స్ చేయాలని వేధిస్తున్నాడని.. పెద్దాపురం సబ్‌జైల్లో డిప్యూటీ జైలర్‌గా ఉన్న సమయంలో సుబ్బారెడ్డి వేధింపులకి గురి చేశాడని యువతి ఆరోపించింది. దీంతో జైలర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జైలర్ వేధిస్తున్నాడంటూ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేయడం ఏపీలో సంచలనంగా మారింది. ఆన్‌లైన్‌లో న్యూడ్ కాల్స్ చేయాలని వేధిస్తున్నాడని.. పెద్దాపురం సబ్‌జైల్లో డిప్యూటీ జైలర్‌గా ఉన్న సమయంలో సుబ్బారెడ్డి వేధింపులకి గురి చేశాడని వివాహిత ఆరోపించింది. డబ్బులు ఇస్తానని.. తాను చెప్పినట్టు చెయ్యండి అంటూ వేధించాడని, కొన్ని వీడియోలు కూడా తనకు పంపినట్లు యువతి పేర్కొంది.. ఈ మేరకు బాధితురాలు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో జైలర్ సుబ్బారెడ్డిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దాపురం సబ్ జైల్ నుంచి ఇటీవల అనంతపురం సబ్ జైలుకు బదిలీ అయ్యారు సుబ్బారెడ్డి.
యువతి ఆరోపణలతో విచారణకు హాజరుకావాలని పోలీసులు సూచించారు.. దీంతో సుబ్బారెడ్డి ఇంటినుంచి పరారయ్యాడని సమాచారం.. దీంతో జైలర్ సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ జైళ్లశాఖ డీజీకి లేఖ రాశారు విశాఖ సీపీ బాగ్చి..
జైలర్‌పై త్వరలో ఛార్జ్‌షీట్ ఫైల్ చేస్తామని.. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు పంపించామని సీపీ బాగ్చి తెలిపారు. బాధితురాలికి న్యూడ్ వీడియోలు ఫోటోలు పంపినట్టు తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
