food poision in ananthapur : అనంతపురం జిల్లాలో అలజడి.. కలుషిత ఆహారం తిని 13 మందికి అస్వస్థత !
అనంతపురం జిల్లాలో అలజడి రేగింది. కలుషిత ఆహరం తిని 13 మంది అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని సోమందేపల్లి మండలం మండ్లి గ్రామంలో ఆదివారం జరిగిన ..
food poision in ananthapur : అనంతపురం జిల్లాలో అలజడి రేగింది. కలుషిత ఆహరం తిని 13 మంది అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని సోమందేపల్లి మండలం మండ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం జరిగిన ఓ ఫంక్షన్ లో కలుషిత ఆహారం తిని 13 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురు చిన్నారులు, ఏడుగురు పెద్దలు ఉన్నారు. వీరిని వెంటనే హిందూపురంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఎలాంటి ప్రాణహాని లేదని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.