AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆటో డ్రైవర్‌ కూతురు ఆకాశంలో ఎగరనుంది.. ట్రైనీ పైలట్‌కు ఆపన్న హస్తం అందించిన ఎంపీ కోమటిరెడ్డి..

ఆమె తండ్రి ఆటోడ్రైవర్‌. ఆ కుటుంబానికి అదే జీవనాధారం. అయితేనేం పైలట్‌గా ఆకాశంలో ఎగరాలనుకుంది. ఇందుకోసం ఇబ్బందులు, సమస్యలను అధిగమించి ఉన్నత చదువులు అభ్యసించింది.

Telangana: ఆటో డ్రైవర్‌ కూతురు ఆకాశంలో ఎగరనుంది.. ట్రైనీ పైలట్‌కు ఆపన్న హస్తం అందించిన ఎంపీ కోమటిరెడ్డి..
Basha Shek
|

Updated on: Jan 01, 2022 | 1:48 PM

Share

ఆమె తండ్రి ఆటోడ్రైవర్‌. ఆ కుటుంబానికి అదే జీవనాధారం. అయితేనేం పైలట్‌గా ఆకాశంలో ఎగరాలనుకుంది. ఇందుకోసం ఇబ్బందులు, సమస్యలను అధిగమించి ఉన్నత చదువులు అభ్యసించింది. తను కోరుకున్న లక్ష్యానికి చేరువైంది. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందుకెళుతోన్న ఆ యువతి పేరు బోడా అమృత వర్షిణి. నల్గొండ జిల్లాకు చెందిన ఆమె తెలంగాణ ఏవియేషన్‌ అకాడమీలో ట్రైనీ పైలట్‌గా చేరింది. అయితే ఈ పైలట్‌ కోర్సును పూర్తి చేయాలంటే రూ.2లక్షలు అవసరమయ్యాయి. ఆర్థిక సహాయం చేయాలని ఎంతోమందిని అభ్యర్థించింది. కానీ ఎవరూ ఆమె అభ్యర్థనను పట్టించుకోలేదు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు కూడా ఆమె విన్నపాన్ని పెడచెవిన పెట్టాయి.

రూ. 2లక్షల ఆర్థిక సాయం.. ఈక్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి అమృతకు ఆపన్నహస్తం అందించారు. ఆమె గురించి తెలుసుకుని తన ఏవియేషన్‌ కోర్సుకయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చారు. ఇందులో భాగంగా ఆమెకు రూ.2లక్షల చెక్‌ను అందజేశారు. ‘ఆర్థిక సాయం కోసం అమృత ఎందరో ప్రజాప్రతినిధులను కలిసింది. దురదృష్టవశాత్తూ ఏ తెలంగాణ పథకమూ కూడా ఆమెను ఆదుకోలేకపోయింది . అందుకే ఓ ప్రజాప్రతినిధిగా నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఓ ఆటోడ్రైవర్‌ కూతురు పైలట్‌ అవుతుందంటే మనమందరం గర్వించాల్సిన విషయం’ అని ఎంపీ ఈ సందర్భంగా తెలిపారు. Also Read:

Hyderabad: వనస్థలిపురంలో కారు బీభత్సం.. మద్యం మత్తులో అపార్ట్‌మెంట్‌ గోడను ఢీకొట్టిన యువకులు..

Puneeth Rajkumar: త్వరలో లక్కీమ్యాన్ రాబోతున్నారు.. ఆకట్టుకుంటోన్న పునీత్‌ రాజ్‌కుమార్‌ కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌

Hyderabad: వనస్థలిపురంలో కారు బీభత్సం.. మద్యం మత్తులో అపార్ట్‌మెంట్‌ గోడను ఢీకొట్టిన యువకులు..