AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Rajkumar: త్వరలో లక్కీమ్యాన్ రాబోతున్నారు.. ఆకట్టుకుంటోన్న పునీత్‌ రాజ్‌కుమార్‌ కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌

2021లో భారతీయ సినిమా పరిశ్రమకు గుండెకోత మిగిల్చిన ఘటనల్లో కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ హాఠాన్మరణం ఒకటి. గత ఏడాది అక్టోబర్ 29న జిమ్ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు పునీత్‌

Puneeth Rajkumar: త్వరలో లక్కీమ్యాన్ రాబోతున్నారు..  ఆకట్టుకుంటోన్న పునీత్‌ రాజ్‌కుమార్‌ కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌
Basha Shek
|

Updated on: Jan 01, 2022 | 1:41 PM

Share

2021లో భారతీయ సినిమా పరిశ్రమకు గుండెకోత మిగిల్చిన ఘటనల్లో కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ హాఠాన్మరణం ఒకటి. గత ఏడాది అక్టోబర్ 29న జిమ్ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు పునీత్‌. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో కన్నడతో పాటు యావత్‌ భారతీయ సినిమా పరిశ్రమ తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. కాగా పునీత్‌ ఆకస్మిక మరణంతో ఆయన నటించిన సినిమాలు, ప్రాజెక్టులపై అయోమయం నెలకొంది. అయితే కర్ణాటక అడవుల పరిరక్షణ నేపథ్యంలో తెరకెక్కిన ‘గంధడ గుడి’ అనే డాక్యుమెంటరీకి సంబంధించిన వీడియో కొన్ని రోజుల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా పునీత్‌ నటించిన మరో సినిమా ‘ లక్కీమ్యాన్’ ఫస్ట్ లుక్ విడుదలైంది.

కాగా 2020లో తమిళంలో విడుదలైన ఘనవిజయం సాధించిన ‘ఓ మై కడవులే’ కన్నడ రీమేక్‌గా ‘లక్కీమ్యాన్’ తెరకెక్కుతోంది. ఈచిత్రంలో డార్లింగ్ కృష్ణ, రోష్ని ప్రకాశ్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. పునీత్ రాజ్ కుమార్ఈ దేవుని పాత్రను పోషిస్తున్నాడు. ఈక్రమంలో పునీత్‌ కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన డార్లింగ్‌ కృష్ణ ‘ త్వరలో దేవుడు రాబోతున్నారు’ అని క్యాప్షన్‌ పెట్టాడు. కాగా ఈ సినిమాలో భాగంగా ఇండియన్‌ మైఖెల్‌ జాక్సన్‌ ప్రభుదేవాతో కలిపి ఒక పాటకు స్టెప్పులు కూడా వేశారు పునీత్‌. కొద్ది రోజుల క్రితం ఈ పాటకు సంబంధించిన విజువల్స్‌ సోషల్‌ మీడియాలో బాగా చక్కర్లు కొట్టాయి.

Also Read:

Hyderabad: వనస్థలిపురంలో కారు బీభత్సం.. మద్యం మత్తులో అపార్ట్‌మెంట్‌ గోడను ఢీకొట్టిన యువకులు..

Kangana Ranaut: ముక్కంటీశుని సేవలో కంగనా రనౌత్‌.. రాహుకేతు పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లింపు..

APPSC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఏపీపీఎస్సీలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...