Telangana: పిల్లలకు ఈత నేర్పిద్దామని స్విమ్మింగ్ పూల్‌కి తీసుకెళ్లాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది
విహారం విషాదంగా మారింది. తన పిల్లల సరదాను తీర్చడానికి వచ్చిన తండ్రి అందనంత లోకాలకు వెళ్లాడు. అప్పటివరకు ఆనందంగా ఉన్న అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. స్విమ్మింగ్ పూల్ వారికి మృత్యువుగా మారి.. వారి ప్రాణాలను బలితీసుకుంది. ఆ వివరాలు ఇలా..

విహారం విషాదంగా మారింది. తన పిల్లల సరదాను తీర్చడానికి వచ్చిన తండ్రి అందనంత లోకాలకు వెళ్లాడు. అప్పటివరకు ఆనందంగా ఉన్న అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. స్విమ్మింగ్ పూల్ వారికి మృత్యువుగా మారి.. వారి ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలోనీ ఓ స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా ఈత కొట్టడానికి తన పిల్లలతో వచ్చిన గులాం హుసేన్ ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందాడు. మృతుడు గులాం హుస్సేన్ మేడ్చల్ జిల్లా గాగిల్లాపూర్‌కి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. తన పిల్లలు ఇద్దరు తమను సరదాగా స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్లమని మారం చేయడంతో.. ఇద్దరు పిల్లల్ని అన్నారంలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌కు తీసుకువచ్చాడు. ఇద్దరు పిల్లలు స్విమ్మింగ్ పూల్ బయట ఉండగానే హుస్సేన్ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. ఇది గమనించిన స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు హుస్సేన్‌ను బయటకు తీసేలోపే ప్రాణాలు విడిచాడు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండే హుస్సేన్ మృతి చెందడంతో.. ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుంది. తమకు ఇక దిక్కు ఎవరు అంటూ ఏడవడం అందరిని కలిచి వేసింది. తన పిల్లలకు ఈత నేర్పిద్దామని స్విమ్మింగ్ పూల్‌కు తీసుకొచ్చి అతను అదే స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోవడం బాధాకరం అంటూ స్థానికులు అంటున్నారు.