AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ గ్రామంలో వర్షాల కోసం విచిత్ర పూజలు.. ఇలా చేస్తే వరుణుడు వెంటనే కరునిస్తాడట!

వర్షాకాలం వచ్చింది. అయినా వానమ్మ మాత్రం అప్పుడప్పుడు మెరుపుతీగలా వచ్చిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో అస్సులు వర్షాలే కురవట్లేదు. వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోతున్నాయి. వర్షాల కాలంలో నీటితో కలకలలాడాల్సిన చెరువులు, కుంటలు అడుగంటిపోయి ఉన్నాయి. వర్షం ఎప్పుడొస్తుందోనని ఆకాశంపై చూస్తున్న రైతన్నలు.. వరుణిడి రాక కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వర్షాలు కురిపించాలని వినూత్న రీతిలో మొక్కులు చెల్లిస్తున్నారు.

Telangana: ఆ గ్రామంలో వర్షాల కోసం విచిత్ర పూజలు.. ఇలా చేస్తే వరుణుడు వెంటనే కరునిస్తాడట!
Janagama
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jul 20, 2025 | 1:22 PM

Share

వర్షాల కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే గ్రామ గ్రామాన కప్పతల్లి ఆటలు గ్రామ దేవతలకు జలాభిషేకాలు జరుగుతున్నాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని రాఘవపూర్ గ్రామంలో ప్రతి ఏటా వర్షాలు సమృద్ధిగా కురవాలని, వరునుడి కటాక్షం కోసం గ్రామానికి దూరంగా ఉండే పోతరాజు గండి వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అందరూ కలిసి బియ్యం, బెల్లం, పాలు, కుడుకతో చేసిన వరద పాశంను తీసుకెళ్లి కొండపూత రాజుకు నైవేద్యంగా పెడతారు.

ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొండ పోతరాజు వద్ద బండపై వరదపాశంను పోస్తారు. ఈ వరద పాశంను ముందుగా గ్రామంలోని పెళ్లి కాని యువకులు విచిత్ర రీతిలో నాకుతూ మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తరువాత మగవాళ్ళు మాత్రమే గ్రామ పెద్దలు, రైతులు సైతం ఇదే రీతిలో వరదపాషాన్ని నాకుతూ మొక్కులు అప్పగిస్తారు. వర్షాలు ముఖం చాటేయడంతో, వరునుడి కటాక్షం కోసం ప్రతి ఏటా తమ పూర్వీకుల నుండి వస్తున్న ఈ ఆచారాన్ని వర్షాలు రాని ప్రతిసారి తాము పాటిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు.

చుట్టుపక్కల గ్రామాల వారు సైతం ఇక్కడికి వచ్చి పూజలు ఆచరిస్తున్నారు. ఈ ఆచారాన్ని విశ్వషిస్తున్న గ్రామస్తులు, మొక్కులు చెల్లించిన తర్వాత రెండు రోజులలో వర్షాలు తప్పకుండా కురుస్తాయనేది వీరి నమ్మకం, ప్రతిఏటా వరద పాశం కార్యక్రమం పూర్తయిన వెంటనే వర్ణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాడని గ్రామస్తులు తెలుపుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us