AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Etela Resign Approved: శాస‌న‌స‌భ స‌భ్యత్వానికి ఈటల రాజీనామా.. లేఖ అందిన రెండు గంటల్లోనే స్పీకర్ ఆమోదముద్ర

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ త‌న శాస‌న‌స‌భ స‌భ్యత్వానికి ఈరోజు ఉదయం రాజీనామా చేశారు. ఈటల రాజీనామాను శాస‌న‌స‌భ‌ స్పీకర్ పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి ఆమోదించారు.

Etela Resign Approved: శాస‌న‌స‌భ స‌భ్యత్వానికి ఈటల రాజీనామా.. లేఖ అందిన రెండు గంటల్లోనే స్పీకర్ ఆమోదముద్ర
Balaraju Goud
|

Updated on: Jun 12, 2021 | 2:59 PM

Share

Ex Minister Etela Rajender Resignation approved: మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ త‌న శాస‌న‌స‌భ స‌భ్యత్వానికి ఈరోజు ఉదయం రాజీనామా చేశారు. ఈటల రాజీనామాను శాస‌న‌స‌భ‌ స్పీకర్ పోచారం శ్రీ‌నివాస‌రెడ్డి ఆమోదించారు. ఈ ఉద‌యం గ‌న్‌పార్క్ అమ‌ర‌వీరుల స్తూపం వ‌ద్ద నివాళులు అర్పించిన అనంత‌రం ఈటల అసెంబ్లీ కార్యదర్శికి త‌న రాజీనామా లేఖను అంద‌జేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈట‌ల చేసిన రాజీనామాకు ఆమోదముద్ర వేసినట్లు స్పీకర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు ఈటల చుట్టూనే తిరుగుతున్నాయి. ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఇవాళ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే, ఈటల రాజీనామా పత్రం తనకు అందిన వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ ఆమోద ముద్రవేశారు. రాజీనామా చేసిన 2 గంటల్లోనే సంతకం చేశారు. ఈ ఉదయం గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు ఈటల రాజేందర్. అనంతరం నేరుగా అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో…అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేశారు. స్పీకర్ ఫార్మట్‌లోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు ఈటల రాజేందర్‌ లేఖను పంపించారు. ఆ లేఖ తనకు అందించిన వెంటనే ఆమోద ముద్ర వేశారు స్పీకర్.

Read Also… Kashmir Terrorist attack: కశ్మీర్‌లో మళ్లీ బరితెగించిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరుల మృతి!

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!