Kashmir Terrorist attack: కశ్మీర్‌లో మళ్లీ బరితెగించిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరుల మృతి!

కశ్మీర్‌లో మళ్లీ కాల్పుల మోత మోగింది. జమ్మూలో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌ పట్టణంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి.

Kashmir Terrorist attack: కశ్మీర్‌లో మళ్లీ బరితెగించిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరుల మృతి!
Terror Attack In Sopore
Follow us

|

Updated on: Jun 12, 2021 | 2:44 PM

Kashmir Terrorist attack: కశ్మీర్‌లో మళ్లీ కాల్పుల మోత మోగింది. జమ్మూలో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌ పట్టణంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లతో పాటు ఇద్దరు స్థానికులు హతమయ్యారు. మరికొందరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి, స్థానిక పౌరులకు గాయాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌ పట్టణంలో శనివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, మరో ఇద్దరు పౌరులు మరణించారు. మరో ఇద్దరు పోలీసులు, ఓ పౌరుడికి గాయాలైనట్లు సమాచారం. ఉత్తర కాశ్మీర్‌లోని సోపూర్‌లోని అరంపోరా ప్రాంతంలో పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సంయుక్త బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సాధారణ భద్రతా విధుల్లో ఉన్న పెట్రోలింగ్ పార్టీలో పోలీసులు భాగమని అధికారుల వర్గాలు తెలిపాయి. సోపోర్ పట్టణంలోని ప్రధాన చౌక్ వద్ద ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారని ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. తాము దాడి చేసిన ప్రదేశానికి చేరుకున్నానని, దాడి చేసిన వారిని కనిపెట్టడానికి ఆపరేషన్ ప్రారంభించామని కుమార్ చెప్పారు. అయితే, దాడి వెనుక పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని ఖండించారు. “ఇటువంటి దాడులను ప్రతిఒక్కరూ లేకుండా ఖండించాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నామన్న ఆయన.. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం” అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కాగా, ఉగ్రవాదం, తుపాకీ సంస్కృతిని అంతం చేయాలని జె & కె పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజాద్ లోన్ వరుస ట్వీట్లలో కోరారు.

Read Also….  Covid19 Vaccine: దేశవ్యాప్తంగా వేగంగా వ్యాక్సినేషన్.. దిగివస్తున్న కరోనా కేసులు.. ఇప్పటికి ఎంతమందికి టీకా అందిందంటే..!