Bjp vs Congress: నిర్మల్‌లో జోరందుకున్న ఆపరేషన్ ఆకర్ష్.. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన కీలక నేత..!
నిర్మల్ జిల్లాలో ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రామారావు పటేల్.. కమలం తీర్ధం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఆయన పోయినంత మాత్రాన తమకు..
నిర్మల్ జిల్లాలో ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రామారావు పటేల్.. కమలం తీర్ధం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఆయన పోయినంత మాత్రాన తమకు వచ్చిన నష్టమేమీ లేదంటోంకి హస్తం పార్టీ. నిర్మల్ జిల్లాలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ప్రత్యర్ధి పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న కొంత మందిని తమ పార్టీలోకి లాక్కునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే.. ముథోల్ కాంగ్రెస్ నేత రామారావు పటేల్ ఇటీవలే హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. బీజేపీలో చేరబోతున్నట్టు అప్పుడే ప్రకటించారు.
ఈ ప్రాసెస్‌లో భాగంగా.. భైంసాలో ఎంపీ సోయం బాపురావుతో ఆయన చర్చలు జరిపారు. బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశాల మేరకే రామారావు పటేల్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్లు ఎంపీ బాపూరావు తెలిపారు. అయితే ఆయన పోయినా జిల్లాలో పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి. పార్టీ క్యాడర్ తమతోనే ఉందనే.. త్వరలోనే జిల్లాకు పూర్వవైభవం తెస్తామంటున్నారు.
రామారావు పటేల్ త్వరలోనే చేరుతానని హామీ ఇచ్చినట్లు బాపూరావు చెప్పుకొచ్చారు. తమతో వచ్చే నేతలను కలుపుకునిపోయి.. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..