Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konda Surekha: కొండా సురేఖకు డబుల్ ట్రబుల్.. మంత్రికి మరిన్ని కోర్టు చిక్కులు..!

తెలంగాణ మంత్రి కొండా సురేఖను ఒకే టైమ్‌లో రెండు పరువు నష్టం దావా కేసులు చుట్టుముట్టాయి. అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది.. నాంపల్లి కోర్టు. తదుపరి విచారణను ఈ నెల 23కు కోర్టు వాయిదా వేసింది. ఈ నెల ఎనిమిదిన నాగార్జునతో పాటు సాక్షిగా వచ్చిన సుప్రియ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన కోర్టు..

Konda Surekha: కొండా సురేఖకు డబుల్ ట్రబుల్.. మంత్రికి మరిన్ని కోర్టు చిక్కులు..!
Konda Surekha
Follow us
Janardhan Veluru

| Edited By: Ravi Kiran

Updated on: Oct 10, 2024 | 8:38 PM

అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో కొండా సురేఖ వెనక్కి తగ్గినా.. కోర్టు కేసులు మాత్రం వదిలేలా కనిపించడం లేదు. ఈ వ్యవహారంపై తెలంగాణ మంత్రికి నోటీసులు జారీ చేసింది నాంపల్లి కోర్టు. మరోవైపు ఇదే అంశంపై కోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌ పిటిషన్‌పై కూడా కోర్టు విచారణ చేపట్టింది.

తెలంగాణ మంత్రి కొండా సురేఖను ఒకే టైమ్‌లో రెండు పరువు నష్టం దావా కేసులు చుట్టుముట్టాయి. అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది.. నాంపల్లి కోర్టు. తదుపరి విచారణను ఈ నెల 23కు కోర్టు వాయిదా వేసింది. ఈ నెల ఎనిమిదిన నాగార్జునతో పాటు సాక్షిగా వచ్చిన సుప్రియ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన కోర్టు.. మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్‌మెంట్‌ని ఈ రోజు నమోదు చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో..అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై అక్కినేని కుటుంబం, సమంతతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు మంత్రి కొండా సురేఖ. అయితే కొండా సురేఖ కామెంట్స్‌పై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు..అక్కినేని నాగార్జున. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు వందకోట్లకు పరువు నష్టం దావా వేశారు..నాగార్జున.

మరోవైపు ఇదే వ్యవహారంలో మాజీమంత్రి కేటీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు..తదుపరి విచారణను ఈ 14కు వాయిదా వేసింది. తన ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌లో ఆరోపించిన కేటీఆర్‌..మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్‌, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్న కేటీఆర్.. కొండా సురేఖ మాట్లాడిన వీడియోలను కోర్టుకు సమర్పించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను..9ఏళ్లు మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించానని.. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి అవార్డులు, పెట్టుబడులు తెచ్చానని పిటిషన్‌లో కోర్టుకు తెలిపారు. బెస్ట్ ఐటీ మినిస్టర్‌గా 2020లో అవార్డు తీసుకున్నానని.. అలాంటి తనపై రాష్ట్రమంత్రి కొండా సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. తన పరువుకు తీవ్ర భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై.. BNS 356సెక్షన్ కింద చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి