Hyderabad: నిరుద్యోగులు జర జాగ్రత్త.. లేకుంటే మీరు కూడా ఇలానే..

హైదరాబాద్‌లో యూసుఫ్ అనే వ్యక్తి జాబ్ ఇప్పిస్తానంటూ అవసరంలో ఉన్న కొందరి నుంచి వేలాది రూపాయలు డబ్బులు వసూలు చేశాడు. ఉద్యోగం ఎక్కడా అని అడిగినవాళ్లతో అదిగో.. ఇదిగో అని మాయమాటలు చెబుతూ తొందరలోనే ఇప్పిస్తానంటూ కాలయాపన చేశాడు.

Hyderabad: నిరుద్యోగులు జర జాగ్రత్త.. లేకుంటే మీరు కూడా ఇలానే..
A Person Cheated Unemployed
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Ravi Kiran

Updated on: Oct 10, 2024 | 8:37 PM

హైదరాబాద్‌లో యూసుఫ్ అనే వ్యక్తి జాబ్ ఇప్పిస్తానంటూ అవసరంలో ఉన్న కొందరి నుంచి వేలాది రూపాయలు డబ్బులు వసూలు చేశాడు. ఉద్యోగం ఎక్కడా అని అడిగినవాళ్లతో అదిగో.. ఇదిగో అని మాయమాటలు చెబుతూ తొందరలోనే ఇప్పిస్తానంటూ కాలయాపన చేశాడు. అలా పదుల సంఖ్యలో అమాయకులు ఆయన చెప్పిన మాటలు నమ్మి బుట్టలో పడిపోయారు. వేలకు వేలు డబ్బులు ఇస్తూ తీరా ఏ ఫలితం లేదని తెలిశాక మోసపోయామని గ్రహించారు. తాను ఉస్మానియా ఆస్పత్రిలోనే పని చేస్తానని, అక్కడే మార్చురీలో ఉద్యోగం కల్పిస్తానని నమ్మి డబ్బులు ఇచ్చానని ఒక బాధితుడు వాపోయాడు. పనిలో చేరేందుకు డబ్బు కట్టలేనని ముందే చెప్తే, ఏదో విధంగా తనని సముదాయించి జీతంలో కట్ చేసుకుంటానని చెప్పి చివరికి చేతులెత్తేశాడని మరో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అర్జెంటుగా చేరాల్సిన పని ఉందని, మిగతావన్నీ తర్వాత మాట్లాడుకుందాం.. ముందు డబ్బులు పంపండి, పని మొదలుపెట్టొచ్చని నమ్మించి మోసపోయిన కథ మరో బాధితుడిది. కావాల్సిన పేపర్లన్నీ పంపించాలని, స్కానర్ ద్వారా డబ్బులు వేయాలని చెబితే నమ్మి అలా పంపించిన బాధితులు ఎందరో ఉన్నారు. ఆరు నెలలు పని చేస్తే ఆ తర్వాత గవర్నమెంట్ కింద జాబ్ పర్మినెంట్ అయిపోతుందని నోటికి వచ్చింది చెప్పి నమ్మించి డబ్బులు కట్టించుకున్నాడని మరో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

చివరికి ఆ మోసగాడిని బాధితులు అంతా కలిసి పట్టుకుని నిలదీశారు. తాము ఎలా మోసపోయామో పోలీసులకు వివరించి ఎలాగైనా తమకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను వేడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి బాలాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనపై ఫిర్యాదు చేస్తే మెడికల్ టెస్ట్ సమయంలో మీకు పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపేసి డెడ్ బాడీని మీ ఇంటివాళ్లకు కూడా దక్కనివ్వనని యూసుఫ్ అన్నాడని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!