Watch: ఏదైనా అదృష్టం ఉండాలే.. లక్కీ డ్రాలో శునకానికి గణపతి లడ్డూ.. వీడియో

హనుమకొండలో విచిత్ర సంఘటన జరిగింది. గణపతి మండపాల వద్ద నిర్వహించిన లడ్డు లక్కీ డ్రాలో పెంపుడు శునకానికి బంపర్ ఆఫర్ తగిలింది. లక్కీ డ్రా లో శునకానికి లడ్డూ తలగడంతో ఆ పెంపుడుకుక్క యాజమాని కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.

Watch: ఏదైనా అదృష్టం ఉండాలే.. లక్కీ డ్రాలో శునకానికి గణపతి లడ్డూ.. వీడియో
Dog wins Ganapati Laddu
Follow us
G Peddeesh Kumar

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 16, 2024 | 4:55 PM

హనుమకొండలో విచిత్ర సంఘటన జరిగింది. గణపతి మండపాల వద్ద నిర్వహించిన లడ్డు లక్కీ డ్రాలో పెంపుడు శునకానికి బంపర్ ఆఫర్ తగిలింది. లక్కీ డ్రా లో శునకానికి లడ్డూ తలగడంతో ఆ పెంపుడుకుక్క యాజమాని కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. ఈ విచిత్ర సంఘటన హనుమకొండ డబ్బాల్ ప్రాంతంలోని శ్రీ గజానన మండపం వద్ద జరిగింది. ఇదే ప్రాంతానికి చెందిన రాజేష్ వాణి దంపతులు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వారి ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు కుక్క సోనీ పేరిట కూడా ఒక లక్కీ డ్రా చిట్టి రాసి బాక్స్ లో వేశారు. సోమవారం గణపతి నిమజ్జనం సందర్భంగా ఉత్సవ కమిటీ వారు లక్కీ డ్రా తీసిన క్రమంలో లడ్డు లక్కీ డ్రాలో పెంపుడు కుక్క సోనీ పేరు వచ్చింది..

పెంపుడు కుక్కకు లడ్డు రావడంతో ఆ కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఎల్లప్పుడు కుక్క కూడా తమ కుటుంబంలో ఒక సభ్యురాలుగా పెరుగుతుందని తమ శూనకానికి లడ్డూ దక్కడం తమ ఇంటి సభ్యుడికి వచ్చిన అంత ఆనందంగా ఉందని మురిసిపోతున్నారు.

వీడియో చూడండి..

గణపయ్యను గంగమ్మ ఒడికి తరలిస్తున్న తరుణంలో లక్కీ డ్రాలో శునకానికి లడ్డూ దక్కడం వరంగల్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఆ ఇంట్లో అందరి పేరుతో డ్రాలో చిట్టిలు వేయగా.. డ్రా మాత్రం ఆ శునకానికి దక్కిందని.. ఏదిఏమైనా గణపతి లడ్డూ దక్కడం అదృష్టం అంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..