Medchal: మా గొప్ప డాక్టర్.. విరిగింది ఒక కాలు అయితే మరో కాలుకు సర్జరీ..
కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న సామెత చందంగా ఉంది ఈ ఇన్సిడెంట్. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడటంతో ....
కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న సామెత చందంగా ఉంది ఈ ఇన్సిడెంట్. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడటంతో స్థానికులు అతణ్ని ఆస్పత్రికి తరలించారు. కాలు విరిగిందని చెప్పిన వైద్యులు, ఆపరేఫన్ చేశారు. సర్జరీ అనంతరం కళ్లు తెరిచి చూసిన బాధితుడు కంగుతిన్నాడు. అసలు ఏమైందంటే, సిద్దిపేట జిల్లా ఉద్దేమర్రి గ్రామానికి చెందిన సురేశ్ పని నిమిత్తం వేరే ఊరు వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో సురేశ్ కాలుకి దెబ్బతగిలింది. గమనించిన స్థానికులు అతణ్ని మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చారు. ప్రమాదంలో సురేశ్ కాలు విరగడంతో అతడికి శస్త్ర చికిత్స చేశామని చెప్పారు డాక్టర్లు. సర్జరీ తర్వాత కళ్లు తెరిచిన సురేశ్.. తన కాలిని చూసి షాక్‌కు గురయ్యాడు. విరిగిన కాలికి కాకుండా.. మరో కాలికి శస్త్రచికిత్స చేయడం గమనించి ఖంగుతిన్నాడు. సురేశ్ బంధువులు, కుటుంబ సభ్యులు.. వైద్యులను నిలదీయగా.. పొరపాటు జరిగిందని చెప్పారు. మళ్లీ విరిగిన కాలికి శస్త్రచికిత్స చేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో ఆస్పత్రి యాజమాన్యంతో సురేశ్ కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. బాధితుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అసలు విరగని కాలికి సర్జరీ ఎలా చేశారన్నది మిస్టరీగా మారింది.
Also Read: ‘నడిరోడ్డుపై పట్టిన చేపలు భలే టేస్టీ’.. నిరసన తెలపడంతో ఈ ఎమ్మెల్యే స్టైలే వేరప్పా