Super Police: ఏపీలో నెవ్వర్ బిఫోర్.. పోలీస్ బాస్‌కు గ్రాండ్‌గా సెండాఫ్.. రోడ్లన్నీ పూలమయం

ఆయన జిల్లా పోలీస్ బాస్.. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించేవారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో రాజీపడేవారు కాదు. అంతేకాదు...

Super Police: ఏపీలో నెవ్వర్ బిఫోర్.. పోలీస్ బాస్‌కు గ్రాండ్‌గా సెండాఫ్.. రోడ్లన్నీ పూలమయం
West Godavri Sp
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 16, 2021 | 10:59 AM

ఆయన జిల్లా పోలీస్ బాస్.. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించేవారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో రాజీపడేవారు కాదు. అంతేకాదు సిబ్బందికి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి పరిష్కరించేవారు. అలాంటి వ్యక్తి బదిలీపై వేరే ప్రాంతానికి వెళ్తుంటే.. సిబ్బంది మనసుల్లో ఎంత బాధ ఉంటుందో చెప్పడం కష్టం. ఈ క్రమంలో ఆయనకు ఊహించని విధంగా సెండాఫ్ ఇచ్చి తమ ప్రేమను చాటుకున్నారు అధికారులు, సిబ్బంది. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. పశ్చిమ గోదావరి ఎస్పీగా పనిచేసి తాజాగా బదిలీ అయిన కె.నారాయణ నాయక్‌.   ఆయనకు గౌరవందనం సమర్పించి, పూలవ్యాన్‌ను లాగుతూ అభిమానాన్ని చాటు కున్నారు స్టాఫ్. దారి పొడవునా పూల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఒక పోలీస్ అధికారికి ఈ రేంజ్‌లో సెండాఫ్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైమ్ అంటున్నారు స్థానికులు.

ఆ వీడియో వీక్షించండి…

ఈ సందర్భంగా మాట్లాడిన కె.నారాయణ నాయక్‌ ఎమోషనల్ అయ్యారు.  జిల్లా ఎస్పీగా పదవీకాలం తనకు ఎంతో అమూల్యమని పేర్కొన్నారు. తనకు సహకరించిన ప్రతి పోలీసు అధికారి, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగం కోవిడ్ వైరస్‌ ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రజలకు రక్షణగా నిలిచారని నారాయణ నాయక్‌ అభినందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, నేరగాళ్ల విషయంలో ఎక్కడా రాజీలేకుండా చర్యలు చేపట్టామని ఆయన గుర్తు చేశారు.

Also Read: ‘బాహుబలి’లో రానాలా కటింగ్ కొట్టాడు.. కట్ చేస్తే.. నవ్వుతో మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం

దేశంలో మరో 38,949 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా