India Corona Cases: దేశంలో మరో 38,949 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే కొత్త కేసుల సంఖ్య తగ్గింది. గురువారం 19,55,910 మందికి కరోనా టెస్టులు చేయగా.. 38,949 మందికి వైరస్ పాజిటివ్‌గా....

India Corona Cases: దేశంలో మరో 38,949 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
India Corona Updates
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 16, 2021 | 10:12 AM

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే కొత్త కేసుల సంఖ్య తగ్గింది. గురువారం 19,55,910 మందికి కరోనా టెస్టులు చేయగా.. 38,949 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 6.8 శాతం తగ్గుదల నమోదైంది. ఫలితంగా మొత్తం కేసులు సంఖ్య 3,10,26,829కు చేరింది.  24 గంటల వ్యవధిలో మరో 542 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాలు సుమారు 100 రోజుల కనిష్ఠానికి తగ్గాయి.  దాంతో మొత్తం 4,12,531 మంది మృత్యుఒడికి చేరుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వెలుగుచేస్తోన్న కేసుల్లో సగానికి పైగా కేరళ, మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. కేరళలో కొత్తగా 13 వేల మందికి కరోనా సోకగా.. మహారాష్ట్రలో 8వేల మందికి మహమ్మారి నిర్ధారణ అయ్యింది. కొత్తగా 40,026 మంది వైరస్​ను జయించారు. మొత్తంగా 3,01,83,876 కోట్ల మంది  మహమ్మారి నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 97.28 శాతానికి చేరగా.. క్రియాశీల రేటు 1.39 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 4,30,422 మంది వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు.  ఇక గురువారం 38.78 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 39.53 కోట్లుగా ఉంది.

  • మొత్తం కేసులు: 3,10,26,829
  • మొత్తం మరణాలు: 4,12,531
  • కోలుకున్నవారు: 3,01,83,876
  • యాక్టివ్​ కేసులు: 4,30,422

ఇంట్లోనే కోవిడ్ టెస్ట్….

కరోనా మహమ్మారిపై పోరాటంలో తన వంతు కీలక పాత్ర పోషిస్తున్న ఐఐటీ హైదరాబాద్ అనేక విన్నూత్న ఆవిష్కరణలు చేసింది. ఈ క్రమంలో ఇంటి వద్దనే స్వయంగా ఆర్టీపీసీఆర్ స్థాయిలో నిర్ధారణ పరీక్ష చేసే పరికరాన్ని ఐఐటీ హెచ్ పరిశోధకులు రూపొందించారు. అతి తక్కువ సమయంలో.. తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన రిజల్ట్ ఇచ్చే ఈ పరికరం తయారీ సాంకేతికత ఇవ్వడానికి సిద్ధం అని చెప్పారు. ఈ పరికరానికి కోవీహోం అని పేరు పెట్టారు. ఈ కిట్‌ సామర్థ్యం 94.2 శాతం, నిర్దిష్టత 98.2 శాతం ఉన్నట్లు సీఎస్‌ఐఆర్‌-సీసీఎంబీ గుర్తించిందని వివరించారు.

Also Read: ‘బాహుబలి’లో రానాలా కటింగ్ కొట్టాడు.. కట్ చేస్తే.. నవ్వుతో మీ పొట్ట చెక్కలవ్వడం ఖాయం

ట్రాఫిక్‌లో బోర్‌ కొట్టిందని పక్కనే ఉన్న మొసళ్ల నదిలో దూకేశాడు.. ఆ తర్వాత షాక్