Nimmala Rama Naidu: ‘నడిరోడ్డుపై పట్టిన చేపలు భలే టేస్టీ’.. నిరసన తెలపడంలో ఈ ఎమ్మెల్యే స్టైలే వేరప్పా
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన వ్యక్తం చేయడంలో కూడా వినూత్న పంథాను అనుసరిస్తారు. ప్రొటెస్ట్ విషయంలో...
పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన వ్యక్తం చేయడంలో కూడా వినూత్న పంథాను అనుసరిస్తారు. ప్రొటెస్ట్ విషయంలో ఆయన జనం అటెన్షన్‌ను ఇట్టే గ్రాబ్ చేస్తారు. తాజాగా తన నియోజకవర్గంలో రహదారుల దుస్థితిపై చేసిన నిరసన ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. పాలకొల్లు మండలం దగ్గులూరు- పాలమూరు రోడ్డు మీద ఎమ్మెల్యే తెలుగు తమ్ముళ్ల సాయంతో వలలతో చేపలు పట్టి నిరసన వ్యక్తం చేశారు. వాటిని అక్కడే విక్రయించారు. జగన్ పాలనలో రోడ్లు, ఇళ్ల స్థలాలు జలాశయాల మాదిరిగా తయారయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్వాన్నమైన రోడ్లపై ప్రజలు ప్రయాణం చెయ్యలేకపోతున్నారని మండిపడ్డారు. 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే, 10 రోజులు రెస్ట్ తీసుకునేలా రోడ్లు తయారయ్యాయని విమర్శించారు. రెండేళ్లుగా రోడ్లకు మరమ్మత్తులు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదా..? అంటూ ఎమ్మెల్యే నిమ్మల ప్రశ్నించారు.
రోడ్ల దుస్థితిపై టీడీపీ విడుదల చేసిన వీడియో…
గత వారం రోజులుగా ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. కొన్ని చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై టీడీపీ నేతలు సమర శంఖం పూరించి.. నిరసనలు తెలియజేస్తున్నారు.
అచ్చెన్న సెటైర్లు…
రాష్ట్రంలో జగనన్న గుంతల పథకం వల్ల రోడ్డు ఎక్కాలంటేనే ప్రజలు వణికిపోతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలోని రోడ్లు అవినీతికి ప్రతిరూపాలుగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. రెండేళ్లుగా రోడ్లకు మరమ్మతులు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదా అంటూ ప్రశ్నించిన అచ్చెన్న, ప్రజలు గమ్యస్థానానికి చేరడానికి ముందే పోయేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.
Also Read: ఏపీలో నెవ్వర్ బిఫోర్.. పోలీస్ బాస్‌కు గ్రాండ్‌గా సెండాఫ్.. రోడ్లన్నీ పూలమయం