Hyderabad: ఏసీబీ వలలో చిక్కిన అవినీతి అధికారి.. ఎంత డిమాండ్ చేసాడో తెలుసా..

ఏసీబీ వలలో ఓ అవినీతి తిమిగళం చిక్కింది. హైదరాబాద్ నాంపల్లిలోని పట్టణ, గ్రామీణ ప్రణాళిక శాఖ సంచాలకుల కార్యాలయంలో పి. జగన్ మోహన్ ఉప సంచాలకుడిగా పని చేస్తున్నాడు. 50వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‎గా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు.

Hyderabad: ఏసీబీ వలలో చిక్కిన అవినీతి అధికారి.. ఎంత డిమాండ్ చేసాడో తెలుసా..
Planing Officer
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 03, 2024 | 7:41 PM

ఏసీబీ వలలో ఓ అవినీతి తిమిగళం చిక్కింది. హైదరాబాద్ నాంపల్లిలోని పట్టణ, గ్రామీణ ప్రణాళిక శాఖ సంచాలకుల కార్యాలయంలో పి. జగన్ మోహన్ ఉప సంచాలకుడిగా పని చేస్తున్నాడు. 50వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‎గా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం, చెలిమెడ గ్రామానికి చెందిన వేమిరెడ్డి జితేందర్ రెడ్డి.. తన తండ్రి జ్ఞాపకార్థం స్వగ్రామంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం కొరకు DTCEP లే అవుట్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

అన్ని నిబంధనలకు లోబడి కడుతున్నా.. పర్మిషన్ ఇవ్వకుండా డిప్యూటీ డైరెక్టర్ జగన్ మోహన్ రూ. 90వేలు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. పలు మార్లు కార్యాలయం చుట్టూ బాధితుడు తిరిగి రూ. 50వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. డబ్బులు ఇస్తేనే పర్మిషన్ ఇస్తానని లేకుంటే ఇవ్వను అనడంతో.. బాధితుడు జితేందర్ రెడ్డి ఏసిబిని ఆశ్రయించినట్లు తెలిపాడు. అవినీతి అధికారిని పట్టుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు ఏసీబీ అధికారులు. డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అవినీతి అధికారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అలాగే రెండు బృందాలు అతని ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు