Revanth Reddy: సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది.. సీతక్క కు క్యాబినెట్ లో బెర్త్ గ్యారెంటీనా.?
2004కు ముందు చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం నుండి పాదయాత్ర చేపట్టిన రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో తాను చెల్లులుగా భావించే సీతక్క సెంటిమెంట్ తో పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ ను అధికారం లోకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 06వ తేదిన ములుగు నియోజకవర్గంలో సమ్మక్క సారక్క దేవతల సన్నిధి నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన విషయం మనకు తెలిసిందే.

2004కు ముందు చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం నుండి పాదయాత్ర చేపట్టిన రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో తాను చెల్లులుగా భావించే సీతక్క సెంటిమెంట్ తో పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ ను అధికారం లోకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 06వ తేదిన ములుగు నియోజకవర్గంలో సమ్మక్క సారక్క దేవతల సన్నిధి నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన విషయం మనకు తెలిసిందే. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఆయన యాత్ర కొనసాగింది. రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో సీతక్క సెంటిమెంట్ గా తన వెంట నడిచారు. అంతేకాదు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన బస్సుయాత్ర కూడా సీతక్క సెంటిమెంట్ తో ములుగు నియోజకవర్గంలోని రామప్ప దేవాలయం ప్రారంభించారు. ములుగు నియోజకవర్గంలోనే మొట్టమొదటి సభ నిర్వహించి, రాష్ట్రంలో విజయ వంతంగా అధికారంలోకి వచ్చారు.
సబితా ఇంద్రారెడ్డిని సెంటిమెంట్ గా భావించిన రాజశేఖర్ రెడ్డి నాడు తన చెల్లెమ్మ సబితాఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చి కృతజ్ఞత చాటారు. మరి రేవంత్ రెడ్డి తన చెల్లెమ్మ సీతక్క పట్ల ఏ విధంగా రుణం తీర్చుకుంటారు. అనే రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఐతే సీతక్కకు స్వంత చెల్లెలికి ఉన్నంత స్థానం కల్పించిన రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తన క్యాబినెట్ లో స్థానం కట్టబెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అది కూడా కీలక శాఖ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఏ శాఖ కట్టబెట్టిన సీతక్క కు రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో సముచిత స్థానం ఉంటుందని ప్రచారం జరుగుతుంది.. రేవంత్ రెడ్డి కష్ట సుఖాలలో స్వంత చెల్లెలుగా సీతక్క పాలు పంచుకుంటే వేం నరేందర్ రెడ్డి సోదరుడిగా వెంట నడిచారు.. ఈ ఇద్దరికీ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తాని జనం లో చర్చ జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








