Alert: ఒక్క ఫోన్ కాల్.. జీవితాల్లానే మారుస్తోంది.. తేరుకునేలోపే ఖాతాల్లోని రూ. కోట్లు మాయమవుతున్నాయి!
మీరు అతిపెద్ద మళ్లీ లాండ్రిన్ స్కామ్‌లో ఉన్నారు. అయా ఖాతాల నుంచి కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ స్కామ్‌లో మీరే ప్రధాన నిందితులని, మేము చెప్పిన దాని ప్రకారం చెయ్యకపోతే అరెస్ట్ అవ్వక తప్పదు.. అంటూ అగంతకుల ఫోన్ కాల్స్..!
దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే కొత్త రకం మోసాలు మరింత ఎక్కువ అయ్యాయి. ఇందులో బాధితులు పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోయామని లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మీరు అతిపెద్ద మళ్లీ లాండ్రిన్ స్కామ్‌లో ఉన్నారు. అయా ఖాతాల నుంచి కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ స్కామ్‌లో మీరే ప్రధాన నిందితులని, మేము చెప్పిన దాని ప్రకారం చెయ్యకపోతే అరెస్ట్ అవ్వక తప్పదు… మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించడు అంటూ అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పెద్ద మొత్తంలో డబ్బులను కొల్లగొడుతున్నారు సైబర్ నేరస్తులు… ఈ రకంగా ఈ సంవత్సరం ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 300 కోట్లకు పైగా రూపాయలను పోగొట్టుకున్నారు బాధితులు.
అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి..?
ముందుగా మీకు పోలీస్ ఆఫీస్ ఫోటో డీపీతో ఉన్న ఒక కాల్ వస్తుంది. అనంతరం మీ పేరుతో ఒక డ్రగ్స్ పార్సెల్‌ను ముంబై పోలీస్ ఆఫీసర్లు పట్టుకున్నారు. వాటిలో డ్రగ్స్ తోపాటు విలువైన పాస్‌పోర్టులు ఉన్నాయంటూ భయభ్రాంతులకు గురిచేస్తారు. ఒకవేళ మీరు మేము కాదు అని చెప్పినా, మీరు మా సర్వేలెన్సులో ఉన్నారు. తప్పించుకోలేరు, ఇకమీద మీరు ఏమి చేయడానికి ఉండదు. మీ చుట్టుపక్కల మిమ్మల్ని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు అంటూ బాధితులను భయపడతారు. మీరు వెంటనే ముంబైకి రావాల్సి ఉంటుంది లేదా డిజిటల్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావచ్చు అంటూ బాధితులను ఉక్కిరి బిక్కిరి చేస్తారు.
అది నిజమే అని నమ్మిన బాధితులు వెంటనే వీడియో కాన్ఫరెన్స్‌తో అటెండ్ అవుతారు. కాన్ఫరెన్స్‌లో పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న మరో వ్యక్తి డ్రగ్స్ పార్సెల్స్‌ను ఎక్కడికి తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు వారెంట్ సహా మీ మీద అరెస్టుకు రంగం సిద్ధం చేసేందుకు అన్ని రకాల డాక్యుమెంట్స్ ను రెడీ చేసామని హెచ్చరిస్తారు. మీరు వీటి నుంచి తప్పించుకోవాలంటే కొంత డబ్బును తమకు పంపించాలని బెదిరిస్తారు. చేసేదేమీ లేక తమతమ అకౌంట్లలో ఉన్న డబ్బులు వారు అడిగినంత సొమ్మును పంపిస్తున్నారు బాధితులు.
అంతేకాకుండా ఆ రూమ్‌లో నుంచి మీరు ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు అంటూ, ఈ సమాచారాన్ని ఎవరికీ చెప్పకూడదంటూ హెచ్చరిస్తారు. పొరపాటున బయటికి వెళ్లే ప్రయత్నం చేసినా, మీరు అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి అంటూ ముందస్తు వార్నింగ్ ని కూడా ఇస్తారు. దీంతో బాధితులు చేసేదేమీ లేక ఆ గదిలోనే డిజిటల్ అరెస్ట్ కు గురి అవుతారు. డబ్బంతా కోల్పోయాక తామ మోసపోయామని గ్రహించి చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు బాధితులు.
ముఖ్యంగా ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి ఘటన వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. రిటైర్డ్ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్, చార్టెడ్ అకౌంట్స్ ఈ ఫెడెక్స్ డిజిటల్ అరెస్టులో బాధితులు అని సైబర్ క్రైమ్ పోలీసలు తెలిపారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో నెలకు 300కు పైగా కేసు నమోదు అవుతున్నాయని, ఈ సంవత్సరం రూ. 300 కోట్లకు పైగా డబ్బులు బాధితులు పోగొట్టుకున్నారని సైబర్ క్రైమ్ సీఐ ప్రసాద్ తెలిపారు.
ఈ మధ్యకాలంలో నగరానికి చెందిన డాక్టర్‌కు కొరియర్ పేరుతో సైబర్ కేటుగాళ్లు కాల్ చేశారు. అనంతరం విచారణకు హాజరు కాకపోతే అరెస్టుకు రెడీగా ఉండండి అని బెదిరించారు. దీంతో చేసేదేమీలేక తమ దగ్గర మరో ఉపాయం ఉందని డిజిటల్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరైతే సరిపోతుందని సూచించారు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ నేరస్థులతో వీడియో గ్రాండ్ ఫ్రెండ్స్ లో మాట్లాడుతూ విడతల వారీగా దాదాపు కోటి అరవై లక్షల రూపాయలను సైబర్ నేరస్థుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ తర్వాత డబ్బులు లేవని చెప్పి తప్పించుకోగలిగారు. అనంతరం తాను మోసపోయానని గ్రహించిన సదరు డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ విధంగా ఒక్కో బాధితుడు రూ. 25 లక్షలు నుంచి మొదలుకుంటే కొన్ని కోట్ల రూపాయల వరకు మోసపోయారని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వెల్లడించారు.
2023లో సుమారు ఒక్క హైదరాబాద్ కమీషనర్ పరిధిలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో 150 కోట్లకు పైగా బాధితులు డబ్బును కోల్పోతే ఈ సంవత్సరం సుమారుగా రూ. 300 కోట్లకు పైగా డబ్బులను పోగొట్టుకున్నారని పోలీసుల అంచనా వేస్తున్నారు. ఒకవైపు ఫెడెక్స్ మోసాలు, మరోవైపు మనీ లాండరింగ్ మోసాలు, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బాధితులు ఎవరైనా అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చి బెదిరిస్తే, వెంటనే 1930 కి కాల్ చేసి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తప్పు జరిగి నిర్ధారణ అయితే, అరెస్టు చేయాల్సిన సమయం వస్తే పోలీసులు స్వయంగా వచ్చి అరెస్టు చేస్తారంటున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..