Hyderabad Metro: ఏళ్ళు గడిచే కొద్ది బయటపడుతున్న మెట్రో నిర్మాణ లోపాలు.. ఆందోళన వ్యక్తం చేస్తోన్న నగర వాసులు
సిటీ మొత్తంలో అనేక ప్రాంతాల్లో పెచ్చులుడుతున్నాయి, మెట్రో ప్రహరీ గోడల పరిస్థితి చూసి నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, రెండు చోట్ల కాదు ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు వందేళ్ల కోసం నిర్మించింది. ఇన్-ఫ్రా ప్రాజెక్టులు చేపట్టడంలో పేరున సంస్థని హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును నిర్మించింది. స్టేషన్ దగ్గర నుండి వయాడక్ట్స్ వరకు ఫ్రీ కాస్టింగ్ విధానంలో చేపట్టారు. కానీ సంవత్సరాలు గడిచే కొద్ది మెట్రో నిర్మాణపరంగా లోపాలు బయటపడుతున్నాయి చాలా స్టేషన్లో పగలు వచ్చాయి ఇంటికి ఆ తర్వాత మరమ్మతులు చేపట్టారు ఇప్పుడు ప్రహరీ అంటే (పారాపిట్ వాల్) వంతు వచ్చింది. పలుచోట్ల వీటి పెచ్చులు ఊడి రహదారులపై పడుతున్నాయి. సిటీ మొత్తంలో అనేక ప్రాంతాల్లో పెచ్చులుడుతున్నాయి, మెట్రో ప్రహరీ గోడల పరిస్థితి చూసి నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెట్రో రాకపోకలు సాగించేటప్పుడు శబ్దాలు అధికంగా రావడమే కాదు స్టేషన్ కింద నుంచి ఉంటే వైబ్రేషన్స్ ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు పబ్లిక్. ఒకటి, రెండు చోట్ల కాదు ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి. అన్ని మెట్రో స్టేషన్లో పెచ్చులు ఊడుతున్న ప్రహరీలు దర్శనమిస్తున్నాయి.
తయారీ దగ్గరే నాణ్యత తనిఖీలు చేసి స్టేషన్లలో తెచ్చి బిగించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. దీంతో నగరంలో మెట్రో రైలు ట్రాక్ ప్రహరీలు పలుచోట్ల ప్రమాదకరంగా మారాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




Reporter: Navya Chaitanya
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..