AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ‘అయ్యో ఎంత పని చేశారు..’ ఇద్దరు పిల్లలను చంపి, ఆపై ఆత్మహత్య చేసుకున్న దంపతులు..

ఆర్ధిక ఇబ్బందులో.. కుటుంబ కలహాలో.. కారణం ఏదైతేనేమి క్షణికావేశంలో నిండు ప్రాణాలు తీసుకుంటున్నారు నేటి కాలం యువత. చిన్న వయసులోనే చేతులారా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ జంట ఇదే విధమైన క్షణికావేశంలో తాము ఆత్మహత్య చేసుకోవడంతో పాటు.. అభం శుభం తెలియని పసివాళ్లను కూడా కడతేర్చారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది..

Hyderabad: 'అయ్యో ఎంత పని చేశారు..' ఇద్దరు పిల్లలను చంపి, ఆపై ఆత్మహత్య చేసుకున్న దంపతులు..
Jeedimetla Crime
Srilakshmi C
|

Updated on: Sep 01, 2024 | 9:23 PM

Share

జీడిమెట్ల, సెప్టెంబర్ 1: ఆర్ధిక ఇబ్బందులో.. కుటుంబ కలహాలో.. కారణం ఏదైతేనేమి క్షణికావేశంలో నిండు ప్రాణాలు తీసుకుంటున్నారు నేటి కాలం యువత. చిన్న వయసులోనే చేతులారా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ జంట ఇదే విధమైన క్షణికావేశంలో తాము ఆత్మహత్య చేసుకోవడంతో పాటు.. అభం శుభం తెలియని పసివాళ్లను కూడా కడతేర్చారు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గాజుల రామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్‌ (40), వర్షిణి (33) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. రిషికాంత్(11), విహంత్ (3). వీరి స్వస్థలం మంచిర్యాల గత కొంత కాలంగా ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న వెంకటేశ్‌ మానసికంగా ఎంతో చిత్రవధ అనుభవించాడు. చివరికి భార్య వర్షిణితో కలిసి కుటుంబం అంతా చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తమ అపార్ట్‌మెంట్‌లోనే ఇద్దరు పిల్లలను చంపి, దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి అపార్ట్‌మెంట్‌ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆర్థిక ఇబ్బందులతోనే దంపతులు తమ పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

సంగారెడ్డిలో మరో ఘటన: ముగ్గురి పిల్లలకు విషమిచ్చి, తల్లి ఆత్మహత్య! ఏం కష్టం వచ్చిందో..

సంగారెడ్డి జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లి పసివాళ్లను హతమార్చింది. గోరు ముద్దులు తినిపించిన చేతితోనే పసి పిల్లలకు విషమిచ్చి ఆయువు తీసింది. అనంతరం ఆ తాను కూడా ఉరి పోసుకుని తనువు చాలించింది. ఈ గుండెలు పిండే వ్యధ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఇవి కూడా చదవండి

పటాన్‌చెరులోని రుద్రారం గ్రామంలో ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఓ మహిళ మరణాన్ని ఆశ్రయించింది. ఆప్తులు ఆదుకోకపోవడంతో కనిపెంచిన చేతులతోనే కన్న బిడ్డల ఆయువు తీసింది. తన ముగ్గురి పిల్లలకు విషం ఇచ్చి చంపింది. ఆపై తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు బంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తల్లీ బిడ్డలు నలుగురూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.