TS Corona Cases: తెలంగాణ ప్రజలకు ఊరటనిచ్చే వార్త.. రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు..
TS Corona Cases: తెలంగాణలో రోజు రోజు కరోనా వైరస్ ప్రభావం గనణీయంగా తగ్గుతోంది. ఫలితంగా రోజూవారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల....
TS Corona Cases: తెలంగాణలో రోజు రోజు కరోనా వైరస్ ప్రభావం గనణీయంగా తగ్గుతోంది. ఫలితంగా రోజూవారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య కూడా చాలా తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇది తెలంగాణ ప్రజలకు ఊరటనించే అంశం. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61,053 శాంపిల్స్ సేకరించగా.. వీరిలో 1,801 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే పాజిటివ్ కేసుల సంఖ్య కంటే కరోనాను జయించిన వారి సంఖ్య రెట్టింపు అయ్యింది. రాష్ట్రంలో తాజాగా 3,660 మంది కరోనాను జయించారు. ఇదే సమయంలో కరోనా బారిన పడి 16 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 35,042 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం రాష్ట్ర కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది.
ఈ బులెటిన్ ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,75,827 మంది కరోనా బారిన పడగా.. వీరిలో 5,37,522 మంది కోలుకున్నారు. కరోనా వైరస్ సోకి రాష్ట్ర వ్యాప్తంగా నేటికి 3,263 మంది మృత్యువాత పడ్డారు. తెలంగాణలో మరణాల రేటు 0.56 శాతం ఉండగా.. కోలుకున్న వారి సంఖ్య 93.34 శాతంగా ఉంది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,50,89,049 శాంపిల్స్ సేకరించిన పరీక్షించారు.
కాగా, తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 5 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం – 75, జీహెచ్ఎంసీ – 390, జగిత్యాల – 49, జనగామ – 15, జయశంకర్ భూపాలపల్లి – 29, జోగులాంబ గద్వాల – 25, కామారెడ్డి – 4, కరీంనగర్ – 92, ఖమ్మం – 82, కొమరంభీం ఆసిఫాబాద్ – 9, మహబూబ్‌నగర్ – 69, మహబూబాబాద్ – 60, మంచిర్యాల – 47, మెదక్ – 15, మేడ్చల్ మల్కాజిగిరి – 101, ములుగు – 12, నాగర్ కర్నూల్ – 38, నల్లగొండ – 45, నారాయణ పేట – 10, నిర్మల్ – 3, నిజామాబాద్ – 19, పెద్దపల్లి – 68, రాజన్న సిరిసిల్ల – 26, రంగారెడ్డి – 114, సంగారెడ్డి – 68, సిద్ధిపేట – 76, సూర్యాపేట – 29, వికారాబాద్ – 50, వనపర్తి – 55, వరంగల్ రూరల్ – 61, వరంగల్ అర్బన్ – 54, యాదాద్రి భువనగిరి – 6 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Also read: