మైనర్ హత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్.. 24 గంటల్లోనే కేసును ఛేదించినపోలీసులు
Minor Murder case:మైనర్ బాలికపై హత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రకటించారు. నిందితుడిని ధరమ్ సోత్ రాజేశ్(22)గా గుర్తించారు. రాజేశ్‌ను మరిపెడ...
మైనర్ బాలికపై హత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రకటించారు. నిందితుడిని ధరమ్ సోత్ రాజేశ్(22)గా గుర్తించారు. రాజేశ్‌ను మరిపెడ మండలం ధర్మారం తండాకు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. అతడి నుంచి ఒక బైక్ (TS 28 F 1320), సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
శనివారం సీతారాంపురం తండా సమీపంలోని మొండికట్ట గుట్టలో ఓ గిరిజన బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మరిపెడ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నపోలీసులు నిందితుడిని 24 గంటల్లోపే అదుపులోకి తీసుకున్నారు.
మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి చెప్పిన కథనం ప్రకారం.. బాలికది నిందితుడిది వేర్వేరు తండాలు అయినప్పటికీ, వీరిద్దరి మధ్య మూడు నెలల క్రితం పరిచయం ఏర్పడిందని తెలిపాడు. అప్పట్నుంచి ఇద్దదూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ చనువుగా ఉంటున్నారు. అయితే బాలిక తన పెదనాన్న వద్దే ఉంటుంది. వీరికి స్థానికంగా ఉన్న ఈసర్ పెట్రోల్ బంకు వద్ద కిరాణం కొట్టు ఉంది.
అక్కడికి బాలిక వచ్చినప్పుడల్లా ఆమెతో రాజేశ్ మాట్లాడుతుండేవారు. ఈ క్రమంలో ఒంటరిగా కలుద్దామని మైనర్‌ను అతను అడిగాడు. ఇంట్లో ఎవరూ లేక పోవడంతో ఆ బాలికను బయటకు తీసుకెళ్లేందుకు ఒప్పించిడు. ఇక ఆమె మొండికట్ట గుట్ట వద్దకు రావడంతో అక్కడే తేడేళులా సమయం కోసం వేచి చూస్తున్న మృగంల మీద పడ్డాడు.
ఇద్దరూ కలిసి గుట్టపై ఉన్న బండరాయి మీద కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. దీంతో ఇరువురి మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. బాలిక తల బండరాయికి కొట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. అయినప్పటికీ అతను అదేమీ పట్టించుకోకుండా మృగంలా అత్యాచారం చేసి పైశాచిక ఆనందం పొందాడు. బాలిక స్పృహ తప్పిపడిపోయింది.
ఆ తర్వాత రాజేశ్ ఇదే విషయాన్ని శ్రీను అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాడు. శ్రీను బాలిక బావ శంకర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. తక్షణమే శ్రీను, శంకర్ కలిసి బైక్‌పై ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావమైన బాలికను పురుషోత్తమాయగూడెంలో ఆర్ఎంపీ కళాధర్ వద్దకు తీసుకుని వెళ్లారు. అప్పటికే బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్ఎంపీ నిర్ధారించాడు. ఈ కేసులో పక్కా సమాచారం మేరకు నిందితుడిని ఎల్లారిగూడెం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.