AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Accident: రోడ్డు ప్ర‌మాదంలో బాబాయ్ మృతి.. విష‌యం తెలియ‌క రాత్రంతా శ‌వంపై ప‌డుకున్న చిన్నారి..

Accident: సిద్ధిపేట జిల్లా మర్కూర్ మండ‌లంలో విషాదం చోట‌చేసుకుంది. న‌ర్స‌న్న‌పేట‌కి చెందిన ఎక్క‌ల‌దేవి ఐల‌య్య (28) అనే శ‌నివారం రాత్రి తన అన్న‌కొడుకు మోక్షిత్ (4)ను బైక్‌పై ఎక్కించుకొని జ‌గ‌దేవ్‌పూర్..

Accident: రోడ్డు ప్ర‌మాదంలో బాబాయ్ మృతి.. విష‌యం తెలియ‌క రాత్రంతా శ‌వంపై ప‌డుకున్న చిన్నారి..
Accident
Narender Vaitla
|

Updated on: May 31, 2021 | 6:52 AM

Share

Accident: సిద్ధిపేట జిల్లా మర్కూర్ మండ‌లంలో విషాదం చోట‌చేసుకుంది. న‌ర్స‌న్న‌పేట‌కి చెందిన ఎక్క‌ల‌దేవి ఐల‌య్య (28) అనే శ‌నివారం రాత్రి తన అన్న‌కొడుకు మోక్షిత్ (4)ను బైక్‌పై ఎక్కించుకొని జ‌గ‌దేవ్‌పూర్ మండ‌లం తిమ్మాపూర్ వెళుతున్నాడు. ఈ స‌మ‌యంలో రాంన‌గ‌ర్ స‌మీపంలోకి రాగానే రోడ్డుపై ధాన్యం కుప్ప‌లు క‌వ‌ర్ క‌ప్పి ఉన్నాయి. ఇది గ‌మ‌నించ‌ని ఐల‌య్య వేగంగా వాటిపై నుంచి బైక్‌ను పోనించాడు. దీంతో ఇద్ద‌రు ఒక్క‌సారిగా ఎగిరి రోడ్డు మీద ప‌డిపోయారు. ఐల‌య్య త‌ల‌కు తీవ్ర గాయం కావ‌డంతో అక్క‌డిక్క‌డే మృతి చెందాడు. మోక్షిత్‌కు మాత్రం స్వ‌ల్ప గాయాలు అయ్యాయి. బాబాయ్ ఐల‌య్య ఎంత‌కీ ప‌ల‌క‌పోవ‌డంతో అత‌డి మృత‌దేహంపైనే త‌ల వాల్చి మోక్షిత్ రాత్రంతా అలాగే నిద్ర‌పోయాడు. రాత్రి స‌మ‌యం కావ‌డంతో అటుగా ఎవ‌రూ రాలేదు.. దీంతో ఈ విష‌యాన్ని ఎవ‌రూ గుర్తించ‌లేదు. ఇక ఆదివారం ఉద‌యం తెల్ల‌వారు జామున వ్య‌వ‌సాయం ప‌నుల కోసం అటుగా వెళుతుండ‌గా గ‌మ‌నించిన ఓ రైతు విష‌యాన్ని గ్రామ‌స్తుల‌కు తెలిపాడు. అంద‌రూ వ‌చ్చి చూసే స‌రికి బాలుడు శ‌వంపై త‌ల‌పెట్టి ప‌డుకుని ఉన్నాడు.. దీంతో గ్రామ‌స్తులు ఒక్క‌సారిగా షాక్‌కి గుర‌య్యారు. వెంట‌నే ఐల‌య్య కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం ఇచ్చిన గ్రామ స‌ర్పంచ్.. మృత‌దేహాన్ని గ‌జ్వేల్ ప్ర‌భుతాసుప‌త్రికి త‌ర‌లించారు. రాత్రంతా ఆ చిన్నారి శ‌వంతో గ‌డ‌ప‌డం స్థానికులను కంట‌త‌డి పెట్టించింది.

Also Read: Coronavirus: కరోనా నుంచి కోలుకున్న‌ తర్వాత అటాక్ చేస్తోన్న ప్ర‌ధాన జ‌బ్బులు ఇవే – జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు

Jr NTR: ట్విట్టర్ లో రికార్డ్ క్రియేట్ చేసిన యంగ్ టైగర్.. తారక్ ను ఫాలో అయ్యేవాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా..

Jr NTR: ట్విట్టర్ లో రికార్డ్ క్రియేట్ చేసిన యంగ్ టైగర్.. తారక్ ను ఫాలో అయ్యేవాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?