Jr NTR: ట్విట్టర్ లో రికార్డ్ క్రియేట్ చేసిన యంగ్ టైగర్.. తారక్ ను ఫాలో అయ్యేవాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజే వేరు. డాన్స్ లతో డైలాగులతో.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంలో తారక్ దిట్ట.

Jr NTR: ట్విట్టర్ లో రికార్డ్ క్రియేట్ చేసిన యంగ్ టైగర్.. తారక్ ను ఫాలో అయ్యేవాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా..
Jr Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: May 31, 2021 | 6:14 AM

Jr NTR:

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజే వేరు. డాన్స్ లతో డైలాగులతో.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంలో తారక్ దిట్ట. టాలీవుడ్ టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్న తారక్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. గిరిజన వీరుడు కొమరం భీంగా ఈ సినిమాలో కనిపించనున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. కరోనా మహమ్మారి విజృంభించడం, అందులోను తారక్ కూడా కరోనా బారిన పడటంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ మునుపెన్నడూ చేయని డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నాడని అంటున్నారు. ఇదిలా ఉంటే తారక్ ను అబిమానించేవాళ్ళు బయట కోట్లల్లో ఉన్నారు. ఇక సోషల్ మీడియాలోనూ అదే రేంజ్ ఉంది ఈ యంగ్ టైగర్ కు. తాజాగా ఆయన ట్విటర్ లో ఓ రికార్డ్ ను క్రియేట్ చేశారు.

సెలబ్రిటీలు వ్యక్తిగత విషయాలతో పాటు వారి సినిమాలకు సంబంధించిన విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటూ రోజురోజుకి ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటూనే ఉన్నారు. అయితే టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆయన ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య 5 మిలియన్ కు చేరుకుంది. ట్విట్టర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు.. 11.4 మిలియన్స్ ఫాలోయింగ్ కలిగి ఉండగా.. 6.2 మిలియన్స్ ఫాలోయింగ్ తో సెకండ్ పోసిషన్ లో కింగ్ నాగార్జున.. అదే 6.2 మిలియన్స్ తో దగ్గుబాటి రానా.. ఇంకా మూడో స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 5.8 మిలియన్స్ ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 5 మిలియన్స్ క్లబ్ లో చేరాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Satya Dev: విచిత్ర‌మైన ప‌రిస్థితుల్లో యువ న‌టుడు స‌త్య దేవ్.. డిజిట‌ల్ వైపు అత‌డి రాబోయే సినిమాలు

Prasanth Varma: విభిన్న‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంటున్న యంగ్ మేక‌ర్ ప్ర‌శాంత వ‌ర్మ‌