Satya Dev: విచిత్రమైన పరిస్థితుల్లో యువ నటుడు సత్య దేవ్.. డిజిటల్ వైపు అతడి రాబోయే సినిమాలు
సిల్వర్ స్క్రీన్ మీద లాంగ్ కెరీర్‌ను ప్లాన్ చేసుకున్న సత్యదేవ్ ఇప్పుడు ఓటీటీ స్టార్‌గా మారిపోయారు. కరోనా కారణంగా కొన్ని సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైతే...
సిల్వర్ స్క్రీన్ మీద లాంగ్ కెరీర్‌ను ప్లాన్ చేసుకున్న సత్యదేవ్ ఇప్పుడు ఓటీటీ స్టార్‌గా మారిపోయారు. కరోనా కారణంగా కొన్ని సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైతే… తరువాత తానే స్వయంగా కొన్ని ఓటీటీ ప్రాజెక్ట్స్‌కు కమిట్ అయ్యారు. దీంతో లాక్ డౌన్ టైమ్‌లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ యంగ్ స్టార్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్కూల్ నుంచి వచ్చిన సత్యదేవ్… వర్సటైల్ ఆర్టిస్ట్ అనిపించుకుంటున్నారు. చిన్న సినిమాల్లో హీరోగా… స్టార్స్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే సోలోగా హీరోగా ఎదుగుతున్న టైమ్‌లో… లాక్ డౌన్ సత్యదేవ్ కెరీర్‌ను కష్టాల్లోకి నెట్టింది. థియేట్రికల్ రిలీజ్ కోసం ప్లాన్ చేసిన సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే డిజిటల్ రిలీజ్‌లోనూ సత్యదేవ్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ టాక్ సాధించాయి. దీంతో వరుసగా డిజిటల్ ఆఫర్సే వస్తుండటంతో ఓటీటీ స్టార్‌గా మారిపోయారు ఈ యంగ్ హీరో. లాస్ట్ ఇయర్ ఉమా మహేశ్వర ఉగ్రరూపస్యతో పాటు సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన 47 డేస్, గువ్వా గోరింక సినిమాలు కూడా డిజిటల్‌లోనే రిలీజ్ అయ్యాయి.
తాజాగా సెట్స్ మీద ఉన్న తిమ్మరుసు, గాడ్సే సినిమాలను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇవే కాదు… గాడ్స్ ఆఫ్ ధర్మపురి, లాక్డ్ లాంటి వెబ్ సిరీస్‌లతోనూ డిజిటల్‌లో హవా చూపిస్తున్నారు ఈ యువ నటుడు. ఇలా వరుసగా డిజిటల్ ప్రాజెక్ట్స్ తో బిజీ కావటం సత్యదేవ్ ఫిలిం కెరీర్ ఎఫెక్ట్ అవుతుందేమో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మరి రెండు పడవల ప్రయాణాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.
Also Read: కరోనా నెగిటివ్ అనంతరం సైలెంట్‌గా పవన్.. ఆయన మౌనం వెనుక అర్థం ఏంటి