Kiara Advani: మత్స్యకన్యలా మారిన మహేష్ బాబు హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..
ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ ఎవరంటే టక్కున చెప్పే పేరు కియారా అద్వానీ. హిందీలో వరుస అవకాశాలను దక్కించుకుంటూ తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ.
Kiara Advani:
ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ ఎవరంటే టక్కున చెప్పే పేరు కియారా అద్వానీ. హిందీలో వరుస అవకాశాలను దక్కించుకుంటూ తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు కూడా పరిచయం అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే బోయపాటి శ్రీను రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో ఈ అమ్మడు ,తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. ఇక ఇప్పుడు మరోసారి తెలుగులో నటించాలని చూస్తుంది కియారా. మంచి కథ దొరికితే త్వరలోనే తెలుగులో సినిమా చేయాలనీ చూస్తుంది.
ఇక కియారా సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫొటోలతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. ఇటీవలే మాల్దీవుల విహారం నుంచి అద్భుతమైన ఫోటోలను షేర్ చేసిన కియారా.. తాజాగా సముద్రంలో నీటి అడుగున స్విమ్ చేస్తున్న ఓ ఫోటోని షేర్ చేసింది ఇప్పుడు ఈఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కెరటాల్ని ఆపలేవు కానీ ఈదడం ఎలాగో నేర్చుకోగలవు! అంటూ దీనికి క్యాప్షన్ ని ఇచ్చింది కియరా. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా సరసన `షెర్షా` లో చేస్తుంది కియారా. ఈ చిత్రం జూలై 2 న విడుదల కానుంది. వరుణ్ ధావన్- అనిల్ కపూర్- నీతు కపూర్ లతో `జగ్ జగ్ జీయో`లోనూ కియరా నటిస్తోంది. అలాగే భూల్ భులయ్యా చిత్రంలోనూ కియరా నటిస్తుంది.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :