Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rao Ramesh: బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కర్ణన్ రీమేక్.. కీలక పాత్రలో విలక్షణ నటుడు రావు రమేష్..

అల్లుడు శీను సినిమాతో హీరోగా పరిచయమైన యంగ్ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్ లో చేసిన ఈ యంగ్ హీరో.

Rao Ramesh: బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కర్ణన్ రీమేక్.. కీలక పాత్రలో విలక్షణ నటుడు రావు రమేష్..
Rao Ramesh
Follow us
Rajeev Rayala

|

Updated on: May 31, 2021 | 8:20 AM

Rao Ramesh: అల్లుడు శీను సినిమాతో హీరోగా పరిచయమైన యంగ్ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్ లో చేసిన ఈ యంగ్ హీరో ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ.. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేడకుండా దూసుకుపోతున్నాడు. అయితే సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బెల్లంకొండ హీరోకు. రమేష్ వర్మ దర్శకత్వంలో వచన రీమేక్ సినిమా రాక్షసుడు కాస్త ఊరటను ఇచ్చింది. దాంతో మరోసారి రీమేక్ సినిమానే నమ్ముకుంటున్నాడు ఈ హీరో. ఇటీవల ధనుష్ నటించిన ‘కర్ణన్’ ను రీమేక్  చేయనున్నాడట. ఇటీవల థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, కోలీవుడ్లో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడట. అయితే కర్ణన్ సినిమా ను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో విలక్షణ నటుడు రావు రమేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది.  డిఫరెంట్ గా ఉండే ఆయన డైలాగ్ డెలివరీ, తెరపై ఆయనకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో బిజీగా ఉన్న కేరక్టర్ ఆర్టిస్టులలో రావు రమేశ్ ఒకరు.

‘కర్ణన్’లో కథానాయకుడికి మార్గదర్శకుడిగా నిలిచే ఒక కీలకమైన పాత్రలో ‘లాల్’ నటించారు. కథాపరంగా ఈ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ పాత్రను తెలుగులో రావు రమేశ్ తో చేయించాలని అనుకుంటున్నారట. అందుకోసం సంప్రదింపులు నడుస్తున్నాయని అంటున్నారు. మరో వైపు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టనున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్దమయ్యాడు శ్రీనివాస్. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ప్రస్తుతం హీరోయిన్లను వెతుకుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Vizag Steel : కరోనా నుంచి ఎన్నో ప్రాణాలు కాపాడిన ఘనత వైజాగ్ స్టీల్ దే.. ప్రైవేటీకరిస్తే ఇంత సేవ చేసి ఉండేదా? : విజయసాయి

Film industry is cruel: అక్కడ జరిగేదంతా అదే.. టాలీవుడ్‌పై మరోసారి నోరు జారిన గోవాబ్యూటీ