- Telugu News Photo Gallery Science photos Nasa curiosity rover perseverance snaps shining clouds on mars
NASA Mars Rover: అంగారక గ్రహంపై మరో ఆసక్తికర పరిణామం.. ఫోటో క్లిక్ మనిపించిన నాసా పర్సీవరెన్స్ రోవర్..
NASA Mars Rover: అంగారక గ్రహంపై మరో ఆసక్తికర పరిణామం.. ఫోటో క్లిక్ మనిపించిన నాసా పర్సీవరెన్స్ రోవర్..
Updated on: May 30, 2021 | 10:11 PM

నాసా ప్రయోగించిన మార్స్ క్యూరియాసిటీ రోవర్ పర్సీవరెన్స్ అంగారక గ్రహంపై మెరుస్తున్న మేఘాలను తన కెమెరాలో బంధించింది.

వాస్తవానికి అంగారక గ్రహంపై మేఘాలు ఏర్పడటం చాలా అరుదు. ఈ అరుదైన మేఘాలను నాసా శాస్త్రవేత్తలు సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఈ గ్రహంపై అతి శీతల సమయంలో, పొడి వాతావరంన ఉన్నప్పుడు మాత్రమే మేఘాలు కనిపిస్తాయి. అది కూడా అంగారక గ్రహం సూర్యుడి కక్ష్యలో దూరంగా ఉన్నప్పుడు మాత్రమే మేఘాలు ఏర్పడుతాయని నాసా సైంటిస్టులు చెబుతున్నారు.

ఏదేమైనా.. శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే ముందే అంగారక గ్రహంపై మేఘాలు ఏర్పడటాన్ని రోవర్ గుర్తించడంతో పరిశోధకుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.

శాస్త్రవేత్తలు ఈ సంవత్సరం తొలి నుంచి అంగారక గ్రహంపై మేఘాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, తాజాగా రోవర్ గుర్తించిన మేఘాలు మంచు తుంపరలతో నిండినట్లుగా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేఘాలు అస్తమించే సూర్యడి కాంతి కిరణాలను చెదరగొట్టడంతో మేఘాలు మెరుస్తున్నట్లుగా కనువిందు చేశాయి.




