చిట్ ఫండ్ కంపెనీ నిర్లక్ష్యం.. కన్స్యూమర్ డిస్ప్యుట్స్ ఫోరమ్‌ని ఆశ్రయించిన కస్టమర్.. చివరకు ఏమైందంటే..?

Hyderabad: పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న చిట్ కంపెనీలు కస్టమర్‌లకు చుక్కలు చూపెడుతున్నాయి. సకాలంలో కిస్తీలు కట్టినా చిటీ డబ్బు ఇవ్వకుండా నరకం చూపెడుతున్నాయి. దింతో గత్యంతరం లేక బాధితులు సిటీ కన్స్యూమర్ డిస్ప్యుట్ కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ తరహాలోనే హైదరాబాద్‌కి చెందిన నారాయణ రెడ్డి వాయిది అనే ప్రైవేట్ చీటీ కంపెనీలో 6లక్షలు చీటి వేసాడు. నెలకు 15వేలుగా..

చిట్ ఫండ్ కంపెనీ నిర్లక్ష్యం.. కన్స్యూమర్ డిస్ప్యుట్స్ ఫోరమ్‌ని ఆశ్రయించిన కస్టమర్.. చివరకు ఏమైందంటే..?
Consumer Disputes Forum On Chit Fund Issue
Follow us
Ranjith Muppidi

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 29, 2023 | 2:43 PM

హైదరాబాద్, జూలై 29: పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న చిట్ కంపెనీలు కస్టమర్‌లకు చుక్కలు చూపెడుతున్నాయి. సకాలంలో కిస్తీలు కట్టినా చిటీ డబ్బు ఇవ్వకుండా నరకం చూపెడుతున్నాయి. దింతో గత్యంతరం లేక బాధితులు సిటీ కన్స్యూమర్ డిస్ప్యుట్ కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ తరహాలోనే హైదరాబాద్‌కి చెందిన నారాయణ రెడ్డి వాయిది అనే ప్రైవేట్ చీటీ కంపెనీలో 6లక్షలు చీటి వేసాడు. నెలకు 15వేలుగా 40నెలలు కట్టాడు. 2018 ఏప్రిల్ లో ప్రారంభం అయిన చీటి జులై 2012లో ముగిసింది. నారాయణ్ రెడ్డి చీటీ ఎత్తినప్పుడు ఆయనకు రావాల్సింది 5లక్షల 25వేలు. కానీ నారాయణ్ రెడ్డి కి ఇప్పటి వరకు వాయిది చిట్ సంస్ద కేవలం 2.5లక్షలు మాత్రమే చెల్లించి మిగతా డబ్బులు ఇవ్వకుండా చేతులు ఎత్తిసింది. గత ఏడాదిగా చీటి డబ్బుల కోసం కంపనీ చుట్టూ తిరుగుతున్న వాయిది చీటి నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

ఇక గత్యంతరం లేక బాధితుడు సిటీ కన్స్యూమర్ డిస్ప్యుట్స్ కమిషన్ ను ఆశ్రయించాడు. దింతో ఈ కేసు విచారణకు స్వీకరించిన కమిషన్ చీటీ కంపనీ నిర్వాహకులను విచారించింది. చీటి డబ్బులు ఎత్తిన తర్వాత ఇచ్చిన చెక్ లు బౌన్స్ అయినట్టు తేల్చింది. ఇలా అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత కమిషన్ వాయిది సంస్ద నిర్లక్ష్యాన్ని గుర్తించింది. దీంతో బాధితుడు నారాయణ్ రెడ్డికి ఏడాదిగా బకాయి ఉన్న 2.75 లక్షలను వారంలోగా ఇంట్రస్ట్‌తో సహా చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. బాధితుడికి డబ్బులు సకాలంలో చెల్లించకపోతే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది కన్స్యూమర్ డిస్ప్యూట్స్ కమిషన్.

కాగా, ఈ వాయిది లాంటి మోసపూరిత చిట్ కంపెనీలు సిటీలో అనేకం ఉన్నాయి. మొదట కస్టమర్‌లకు నమ్మకంగా ఉంటున్నా.. డబ్బులు ఇచ్చే సమయంలో మొండికేసి కస్టమర్‌లకు చుక్కలు చూపెడుతున్నాయి. ఇలాంటి సంస్దల లావాదేవీలపై నిఘా పెట్టడంతో పాటు కస్టమర్‌లకు ఇబ్బందులు గురిచేస్తున్న వారి‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి