Warangal: వరంగల్‌కు పోటెత్తిన వరద.. భద్రకాళి చెరువుకు గండి.. భయాందోళనలో ప్రజలు..
వరంగల్, జులై 29: భారీ వర్షాలు, వరదలతో వరంగల్ నగరం అతలాకుతలమవుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా వరద ప్రవాహం వరంగల్ నగరాన్ని చుట్టుముట్టింది. దీంతో నగరం మొత్తం జలమయంగా మారింది. కాగా.. వరద పోటెత్తడంతో వరంగల్‌లోని భద్రకాళి చెరువుకు గండి పడింది. భద్రకాళి చెరువు కట్ట పోతన నగర్ వైపు కోతకు గురైంది. చెరువుకు వరద పోటెత్తడంతో గండి పడినట్లు అధికారులు తెలిపారు. వరద ఉధృతికి చెరువు కట్ట తెగిపోయిందని.. ప్రజలు అప్రమత్తంగడా ఉండాలని సూచించారు.
వరంగల్, జులై 29: భారీ వర్షాలు, వరదలతో వరంగల్ నగరం అతలాకుతలమవుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా వరద ప్రవాహం వరంగల్ నగరాన్ని చుట్టుముట్టింది. దీంతో నగరం మొత్తం జలమయంగా మారింది. కాగా.. వరద పోటెత్తడంతో వరంగల్‌లోని భద్రకాళి చెరువుకు గండి పడింది. భద్రకాళి చెరువు కట్ట పోతన నగర్ వైపు కోతకు గురైంది. చెరువుకు వరద పోటెత్తడంతో గండి పడినట్లు అధికారులు తెలిపారు. వరద ఉధృతికి చెరువు కట్ట తెగిపోయిందని.. ప్రజలు అప్రమత్తంగడా ఉండాలని సూచించారు. ప్రాచీన కాలం నాటి భద్రకాళి చెరువు కట్టకు గండి పడటంతో పోతననగర్, సరస్వతి నగర్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
అధికారులు హుటాహుటిన చెరుకుని భద్రకాళి చెరువు కింద ఉన్న ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. గండి పడిన ప్రాంతంలో ఉన్న కాలనీల వాసులు ఇళ్లు ఖాళీ చేయాలని పేర్కొన్నారు. పోతన నగరల్ వైపు వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో.. ఆయా ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు.
ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో.. అన్ని ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే రెస్క్యూ టీం ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నారు. దిగువున ఉన్న ప్రజలను ఖాళీ చేయాలని సూచనలు చేస్తున్నారు.
కాగా.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరంగల్ నగరం తీవ్రంగా ప్రభావితమైంది.. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. పలువురి రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వర్షాలు, వరదల ప్రభావంతో దాదాపు 10 మంది వరకు మరణించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..