AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోనున్నారా ?.. ఎన్నికల్లో నిలబడేది ఎవరు ?

ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత జానారెడ్డి రాజకీయంగా సైలెంట్‌గా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ నేతల నుంచి పీసీసీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ దరఖాస్తులకు నేడు చివరి తేదీ. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా తాము పోటీచేసే స్థానాల్లో దరఖాస్తు చేసుకున్నారు. కానీ జానారెడ్డి అప్లై చేయలేదు. ఆయన స్థానంలో నాగార్జుసాగర్ నుంచి జానారెడ్డి చిన్న కుమారుడు జైవీర్‌ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

Telangana: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోనున్నారా ?.. ఎన్నికల్లో నిలబడేది ఎవరు ?
Congress Ex Mla Jana Reddy
M Revan Reddy
| Edited By: Ram Naramaneni|

Updated on: Aug 25, 2023 | 12:06 PM

Share

తెలంగాణలోని కాంగ్రెస్ రాజకీయ దిగ్గజం కుందూరు జానారెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారా..? వయోభారంతో క్రియాశీలక రాజకీయాలనుంచి వైదొలగాలని భావిస్తున్నారా..? తన రాజకీయ వారసత్వాన్ని కుమారులతో కొనసాగించేలా పక్కా ప్రణాళిక రచించారా..? అనే ప్రశ్నలు గత కొన్నిరోజుల నుంచి తలెత్తున్నాయి. వీటి గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ దురంధరుడు జానారెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. 2023లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోబోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రిగా ఆయన పనిచేశారు. ఇక నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో జానారెడ్డికి గట్టిపట్టుంది. వయోభారంతో క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలగాలని జానారెడ్డి భావిస్తున్నారు. తన రాజకీయ వారసత్వాన్ని కుమారులతో కొనసాగించేలా పక్కా ప్రణాళిక రచించారు.

2018, 2020 ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత జానారెడ్డి రాజకీయంగా సైలెంట్‌గా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ నేతల నుంచి పీసీసీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ దరఖాస్తులకు నేడు చివరి తేదీ. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా తాము పోటీచేసే స్థానాల్లో దరఖాస్తు చేసుకున్నారు. కానీ జానారెడ్డి అప్లై చేయలేదు. ఆయన స్థానంలో నాగార్జుసాగర్ నుంచి జానారెడ్డి చిన్న కుమారుడు జైవీర్‌ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని జానారెడ్డి నిర్ణయం తీసుకోవడంతో ఆయన చిన్న కుమారుడు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నాగార్జున సాగర్ 2020లో జరిగిన ఉప ఎన్నికల నుంచి జానారెడ్డి చిన్న కొడుకు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ లోనే మకాం వేసి కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. దీంతో ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని జానారెడ్డి నిర్ణయం తీసుకోవడంతో ఆయన చిన్న కుమారుడు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు

మరోవైపు బీఆర్ఎస్ నుంచి తొలి జాబితాను సీఎం కేసీఆర్ ఇప్పటికే విడుదల చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చారు. నాగార్జున సాగర్ నుంచి బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ బరిలోకి దిగుతున్నారు. నోముల భగత్ చేతిలో పరాజయాన్ని చవిచూసిన జానారెడ్డి.. ఈసారి ఎన్నికల్లో భగత్‎తో తనయుడు జైవీర్ తలపడేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ దరఖాస్తుల గడువు నేటితో ముగుస్తోంది. రేపు చివరి రోజు కావడంతో భారీగా అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు భావిస్తున్నాయి. దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత పరిశీలించి సర్వేల రిపోర్టుల ఆధారంగా అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి