AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను తయారు చేసిన యువ ఇంజినీర్.. తక్కువ ఖర్చు.. ఎక్కువ సాగు..

పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన మూల శశిరథ్ రెడ్డి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఈయన తండ్రి వ్యవసాయం చేస్తున్నారు. పూర్తిగా ట్రాక్టర్ ఆధారంగా వ్యవసాయం చేస్తున్నారు. అయితే డీజిల్ ఎక్కువ వాడటంతో పెట్టుబడి పెరిగిపోతుంది. ప్రస్తుతం ఒక ఎకరాకు దున్నాలంటే.. ట్రాక్టర్‎కు రెండు వేల వరకు చెల్లించాలి. అలా రెండు, మూడు సార్లు దున్నాలి. దీంతో ట్రాక్టర్‎కే .. ఎనిమిది వేల వరకు ఖర్చు అవుతుంది.

Telangana: ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను తయారు చేసిన యువ ఇంజినీర్.. తక్కువ ఖర్చు.. ఎక్కువ సాగు..
Sashirath Reddy
G Sampath Kumar
| Edited By: |

Updated on: Aug 25, 2023 | 11:21 AM

Share

ఇప్పుడు డీజిల్ రేట్లు మండిపోతున్నాయి. వ్యవసాయ పెట్టుబడి పెరిగిపోయింది. ఎద్దులతో దున్నడం ఎప్పుడో మానేశారు. పూర్తిగా ట్రాక్టర్ ఆధారంగానే వ్యవసాయం చేస్తున్నారు. అయితే డీజిల్ రేట్లు పెరిగిపోవడంతో రైతుకు పెట్టుబడి పెరిగిపోతుంది. పండించిన పంట మొత్తం పెట్టుబడికే సరి పోతుంది. అయితే ఓ యువకుడు మాత్రం.. డీజిల్ ట్రాక్టర్‎కు బదులు.. ఎలక్ట్రికల్, ట్రాక్టర్ తయారు చేసి అద్భుత ప్రతిభను చాటారు. పూర్తిగా ఛార్జీంగ్ అయితే.. ఈ ట్రాక్టర్ నాలుగు గంటలు పని చేస్తుంది. దీంతో.. రైతులకు.. పెట్టుబడి గణనీయంగా తగ్గనుంది. ఈ ఎలక్ట్రికల్ ట్రాక్టర్ ఎలా తయారు చేసారో..ఇప్పుడు తెలుసుకుందాం.

పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన మూల శశిరథ్ రెడ్డి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఈయన తండ్రి వ్యవసాయం చేస్తున్నారు. పూర్తిగా ట్రాక్టర్ ఆధారంగా వ్యవసాయం చేస్తున్నారు. అయితే డీజిల్ ఎక్కువ వాడటంతో పెట్టుబడి పెరిగిపోతుంది. ప్రస్తుతం ఒక ఎకరాకు దున్నాలంటే.. ట్రాక్టర్‎కు రెండు వేల వరకు చెల్లించాలి. అలా రెండు, మూడు సార్లు దున్నాలి. దీంతో ట్రాక్టర్‎కే .. ఎనిమిది వేల వరకు ఖర్చు అవుతుంది. అయితే. డీజిల్ కాకుండా.. ఎలక్ట్రికల్ ట్రాక్టర్ తయారు చేయాలని ఆలోచించారు. ఈ ట్రాక్టర్ తయారీకి.. నాలుగు లక్షల వరకు ఖర్చు పెట్టారు. తండ్రి కూడా సహకరించారు. ఈ ట్రాక్టర్లో.. 32 చిన్న లిథియం ఫాస్పెట్ బ్యాటరీలు, స్మార్ట్ కంట్రోలర్, 20 హెచ్పీ మోటర్ బిగించారు. ఒక్కసారి బ్యాటరీ బిగించిన తరువాత… 12 ఏళ్ల వరకు ఎలాంటి డోకా ఉండదు. పూర్తిగా ఛార్జీంగ్ అయిన తరువాత… 4 గంటల పాటు ట్రాక్టర్ నడుస్తుంది. నాలుగు గంటల్లో నాలుగు ఎకరాల్లో భూమిని దున్నే అవకాశం ఉంది. అదే డీజిల్ ట్రాక్టర్ అయితే ఎకరానికి రెండు వేల వరకు ఖర్చు అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ ట్రాక్టర్‎తో దున్నితే కేవలం 150 రూపాయాల వరకు ఖర్చు అవుతుంది. రైతుకు ఎకరాకు 1850 రూపాయాల వరకు ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా.. ఎలాంటి రిపేర్లు ఉండవు. అవలీలగా పోలాన్ని దున్నుతుంది. రైతులు ఈ ట్రాక్టర్‎ను చూడటానికి వస్తున్నారు. తమకు కూడా ఇలాంటి ట్రాక్టర్ కావాలని శశిరథ్ రెడ్డిని కోరుతున్నారు. ఇప్పటికే.. ఈ ట్రాక్టర్ సక్సెస్ కావడంతో మరి కొన్ని ట్రాక్టర్లు తయారు చేయాలని ఫ్లాన్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఇప్పటికే ఈ ట్రాక్టర్‎ను అధికారులు చూశారు. ఆగస్టు 15 న పెద్దపల్లి జిల్లా కలెక్టర్.. ఈ యువ ఇంజనీర్‎కు ప్రశంస పత్రం ఇచ్చారు. ఇలాంటి ట్రాక్టర్లు, సాగులోకి దింపుతే రైతులకు పెట్టుబడి తగ్గి.. గణనీయమైన లాభాలు వస్తాయి. ఇలాంటి యువ ఇంజనీర్లను ప్రభుత్వం ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు. తమకు తక్కువ పెట్టుబడితో వ్యవసాయం కోసం ఇలాంటి యంత్రాలను తయారు చేసి ఇవ్వాలని అంటున్నారు. పంట దిగుబడి వస్తున్నా పెట్టుబడి పెరిగిపోవడంతో నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం.. ఇలాంటి ఇంజనీర్లను ప్రోత్సహిస్తే, రైతులకు మరిన్ని ప్రయోజనాలు జరుగనున్నాయి.

Follow Us
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు
ఓటీటీలో సత్తా చాటుతున్న చిన్న సినిమా..
ఓటీటీలో సత్తా చాటుతున్న చిన్న సినిమా..
వర్క్ ప్రెజర్‌ నిజంగానే సంతానోత్పత్తిని తగ్గిస్తోందా?..
వర్క్ ప్రెజర్‌ నిజంగానే సంతానోత్పత్తిని తగ్గిస్తోందా?..