Bharat Jodo Yatra: పాతబస్తీకి చేరుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. పోటెత్తిన కార్యకర్తలు, జనాలు..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ హైదరాబాద్‌కు చేరుకుంది. పాతబస్తీలో రాహుల్ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ హైదరాబాద్‌కు చేరుకుంది. పాతబస్తీలో రాహుల్ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ రాకతో జోడో యాత్ర జనసంద్రమైంది. చార్మినార్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా రాహుల్ గాంధీ వెంట నడుస్తున్నారు. కాగా, జోడో యాత్రలో భాగంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు రాహుల్ గాంధీ. ఆ తరువాత జాతీయ గీతం ఆలపించారు. వేలాది మంది వెంట రాగా, రాహుల్ గాంధీ పాదయాత్ర ముందుకు సాగుతోంది. టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి, మధుయాష్కి సహా ఇతర ముఖ్య నేతలు రాహుల్ వెంట నడుస్తున్నారు.
కాగా, తెలంగాణలో 7వ రోజు భారత్ జోడో యాత్రలో భాగంగా శంషాబాద్ నుంచి బయలుదేరారు రాహుల్ గాంధీ. ఆరాంఘర్ మీదుగా పురాణాపూల్, చార్మినార్ మీదుగా సాయంత్రానికి నెక్లెస్ రోడ్ చేసుకుంటారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక స్తంభంపై జాతీయ పతకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇకపోతే, ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు రాహుల్ గాంధీ. అనంతరం బోయిన్ పల్లిలో గాంధీయన్ ఐడియాలజీ సెంటర్‌లో బస చేయనున్నారు రాహుల్.
తెలంగాణలో 19 అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటన..
తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన సుధీర్ఘంగా సాగనుంది. 12 రోజుల పాటు 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర సాగనుంది. అక్టోబర్ 23న తెలంగాణలో ప్రవేశించిన రాహుల్ పాదయాత్ర.. నవంబర్ 7న మహారాష్ట్రంలోకి ప్రవేశించనుంది. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ.. పలు ప్రాంతాలలో కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసి రాష్ట్రంలోని టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాల తీరును తూర్పారబట్టారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..