Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram Tips: ఇన్‌స్టాగ్రమ్‌లో అసభ్యకరమైన, అనుచితమైన కామెంట్స్ వస్తున్నాయా? ఇలా చెక్ పెట్టండి..

చిన్నా పెద్దా ముసలి ముతక అనే తేడాలేమీ లేవు. పిల్లాడు మొదలు.. పెద్దల వరకు అందరూ సోషల్ మీడియాకు బానిస అయిపోయారనే చెప్పాలి. ఇక వీడియో షేరింగ్ ఆప్షన్ వచ్చాక..

Instagram Tips: ఇన్‌స్టాగ్రమ్‌లో అసభ్యకరమైన, అనుచితమైన కామెంట్స్ వస్తున్నాయా? ఇలా చెక్ పెట్టండి..
Instagram
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 31, 2022 | 4:39 PM

చిన్నా పెద్దా ముసలి ముతక అనే తేడాలేమీ లేవు. పిల్లాడు మొదలు.. పెద్దల వరకు అందరూ సోషల్ మీడియాకు బానిస అయిపోయారనే చెప్పాలి. ఇక వీడియో షేరింగ్ ఆప్షన్ వచ్చాక.. యువత అంతా ఆ వీడియోలను క్రియేట్ చేయడంతోనే గడిపేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ముఖ్యంగి ఇన్‌స్టాగ్రమ్ రీల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ ముహూర్తాన టిక్‌టాక్ వచ్చిందో గానీ, నాటి నుంచి ప్రతీ ఒక్కరూ తమలోని ట్యాలెంట్ బయటపెడుతూ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియోల వల్ల కొందరు చాలా మంది ఫేమస్ అయ్యారు కూడా. అదే సమయంలో కొందరు క్రియేటర్స్ చేసిన వీడియోలో బాగోలేకపోతే నెటిజన్లు ట్రోల్స్ చేస్తారు. ఇంకొందరైతే హద్దులు మీరి కామెంట్స్ చేయడం, వల్గర్ భాషతో కామెంట్స్, మెసేజ్ చేయడం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో.. మెటా యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ Instagram లో సరికొత్త ఆప్షన్‌ను తీసుకువచ్చింది. అవాంఛిత, అభ్యంతరకరమైన కామెంట్స్, మెసేజ్‌ల నుంచి వినియోగదారులు, క్రియేటర్స్‌కు మెరుగైన ప్రొటక్షన్ కల్పించేందుకు ఇటీవల కొన్ని కొత్త ఫీచర్‌లను ఆవిష్కరించింది. ఈ ఫీచర్‌లలో అప్‌డేట్ చేయబడిన హిడెన్ వర్డ్స్, బ్లాకింగ్ ఆప్షన్‌లు, ఇతరాలు ఉన్నాయి. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం.

ఇన్‌స్టాగ్రామ్‌లో హిడెన్ వర్డ్స్ ఫీచర్ ఎలా పని చేస్తుంది?

సోషల్ నెట్‌వర్కింగ్ ఇన్‌స్టాగ్రమ్ హిడెన్ వర్డ్స్ ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇది వినియోగదారుల కంటెంట్‌కు వచ్చే కామెంట్స్, మెసేజ్‌లలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఆటోమాటిక్‌గా ఫిల్టర్ చేస్తుంది. ఈ హిడెన్ వర్డ్స్‌ ఫీచర్‌ను ఎనబుల్ చేసి ఈ అభ్యంతరకరమైన వ్యాఖ్యలను నివారించొచ్చు అని చెబుతున్నారు యాప్ నిర్వాహకులు. ఏ కామెంట్ అయినా, ఎమోజీ అయినా అభ్యంతరకరంగా ఉంటే.. ఆటోమాటిక్‌గా అది హైడ్ అవుతుంది. మరి ఈ హిడెన్ వర్డ్స్‌ ఆప్షన్‌ను ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మీ Android లేదా iOS ఎలక్ట్రానిక్ డివైజ్‌లో Instagram యాప్‌ను ఓపెన్ చేయాలి.

ఇవి కూడా చదవండి

2. కింది భాగంలో కుడి వైపున ప్రొఫైల్ పై క్లిక్ చేయాలి.

3. ఆ తరువాత ప్రొఫెల్‌కి వెళ్లాక.. ఎగువన కుడివైపున ఉన్న మూడు చుక్కల మెనూ బటన్‌పై క్లిక్ చేయాలి.

4. సెట్టింగ్స్ ట్యాబ్‌కు వెళ్లాలి.

5. ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

6. హిడెన్ వర్డ్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

7. అభ్యంతరకరమైన పదాలు, పదబంధాల ట్యాబ్ కింద వర్డ్స్ హైడ్, ఆధునాతన కామెంట్స్ ఫిల్టరింగ్, మెసేజ్ రిక్వెస్ట్ హైడ్ కోసం టోగుల్‌ని ఆన్ చేయాలి.

అయితే, ఈ హైడ్ అయిన కామెంట్స్ ఎవరికీ కనిపించనప్పటికీ.. అవి మీ కామెంట్స్‌లలో కౌంట్ అవుతాయి. ఈ ఆప్షన్‌ను కావాలనుకుంటే మళ్లీ రీసెట్ చేసుకోవచ్చు.

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..