Drinik Malware: ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్‌.. అజాగ్రత్తగా ఉంటే ఇక మీ పని అంతే..

ఆండ్రాయిడ్ ఫోన్‌లను టార్గెట్‌ చేస్తూ మాల్వేర్‌ వెలుగులోకి వచ్చింది. డ్రినిక్‌ అనే మాల్వేర్‌కి కొత్త వెర్షన్‌ను తాజాగా సైబర్‌ నిపుణులు గుర్తించారు. నిజానికి ఈ మాల్వేర్‌ గతంలోనే యూజర్లను టార్గెట్‌ చేసుకుంది. అయితే తాజాగా దీనికి లేటెస్ట్‌ వెర్షన్‌ వచ్చింది. ఈ వైరస్‌ కారణంగానే యూజర్ల ఫోన్‌ స్క్రీన్‌ రికార్డింగ్‌తో..

Drinik Malware: ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్‌.. అజాగ్రత్తగా ఉంటే ఇక మీ పని అంతే..
Drinik Malware
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 01, 2022 | 7:19 AM

ఆండ్రాయిడ్ ఫోన్‌లను టార్గెట్‌ చేస్తూ మాల్వేర్‌ వెలుగులోకి వచ్చింది. డ్రినిక్‌ అనే మాల్వేర్‌కి కొత్త వెర్షన్‌ను తాజాగా సైబర్‌ నిపుణులు గుర్తించారు. నిజానికి ఈ మాల్వేర్‌ గతంలోనే యూజర్లను టార్గెట్‌ చేసుకుంది.  మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. అయితే తాజాగా దీనికి లేటెస్ట్‌ వెర్షన్‌ వచ్చింది. ఈ వైరస్‌ కారణంగానే యూజర్ల ఫోన్‌ స్క్రీన్‌ రికార్డింగ్‌తో పాటు వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలను హ్యాక్‌ చేస్తుంది. ఇప్పటికే 18 భారతీయ బ్యాంకులు ఈ వైరస్‌ బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ వైరస్‌ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని యూజర్లను భారత ప్రభుత్వం సైతం హెచ్చరించింది.

ఇంతకీ వైరస్‌ ఎలా వస్తుందంటే..

ఏపీకే ఫైల్‌ను ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో పంపడం ద్వారా యూజర్లను టార్గెట్‌ చేస్తున్నారు. ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఫోన్‌ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లి పోతుంది. ఆదాయపపు పన్ను రీఫండ్‌ల పేరుతో యూజర్లను మోసం చేస్తున్నారు. డ్రినిక్‌ మాల్వేర్‌కు సంబంధించి తొలిసారి 2016లో వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఎస్‌బీఐ ఖాతాదారులను ఈ మాల్వేర్ టార్గెట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ మాల్వేర్‌ ద్వారా సైబర్‌ నేరస్థులు యూజర్ల ఫోన్‌ను మొత్తం తమ కంట్రోల్‌లోకి తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

ఫోన్‌లో యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం ప్లే స్టోర్‌ నుంచి అది కూడా రివ్యూ, కామెంట్లను పరిశీలించిన తర్వాతే ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఎస్‌ఎంఎస్‌ల రూపంలో వచ్చిన ఏపీకే ఫైల్స్‌ ద్వారా, థార్డ్‌ పార్టీ వెబ్‌సైట్‌లలో ఉండే లింక్‌లతో యాప్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో డౌన్‌లోడ్‌ చేసుకోకూడదు. ఇక యాప్ డౌన్‌లోడ్‌ సమయంలో ఇచ్చే పర్మిషన్స్‌ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.