Nokia G60 5G: నోకియా నుంచి కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. తక్కువ ధరలోనే 50 ఎంపీ కెమెరా..
దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రాగా త్వరలోనే దేశంలోని మిగతా నగరాల్లోనూ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా కంపెనీలు 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసే ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి..
దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రాగా త్వరలోనే దేశంలోని మిగతా నగరాల్లోనూ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా కంపెనీలు 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసే ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నోకియా కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. నోకియా జీ60 పేరుతో లాంచ్ చేయనున్న ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి పీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత ఉండే అవకాశం ఉంది.? లాంటి పూర్తి వివరాలు..
ఈ స్మార్ట్ ఫోన్‌లో 20Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించనున్నారు. కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
Be ready for tomorrow with a 120Hz refresh rate, a 50MP triple AI camera, high-speed 5G connectivity and years of hardware and software support on the new Nokia G60 5G.
Pre-booking with exclusive offers, coming soon.#NokiaG605G #TomorrowisHere #Nokiaphones #LoveTrustKeep pic.twitter.com/pgrEe2IqqM
— Nokia Mobile India (@NokiamobileIN) October 28, 2022
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. 5జీ, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ధర విషయానికొస్తే నోకియా జీ60 5జీ స్మార్ట్ ఫోన్‌లో యూరప్‌లో 346 యూరోలుగా ఉంది. అయితే భారత మార్కెట్లోకి మాత్రం ఈ ఫోన్‌ను రూ. 19,999 నుంచి రూ. 22,999 మధ్యలో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..