Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Search: గూగుల్‌లో ఈ విషయాలను ఎప్పుడూ సెర్చ్ చేయకండి.. చిన్న పొరపాటు జరిగినా అంతే..

గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు మనం తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం. అది చిన్న పొరపాటే అయినా పెద్ద మోసానికి కారణం కావచ్చు. గూగుల్ సెర్చ్‌కు సంబంధించి ముంబైలో జరిగిన షాకింగ్ కేసు గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Google Search: గూగుల్‌లో ఈ విషయాలను ఎప్పుడూ సెర్చ్ చేయకండి.. చిన్న పొరపాటు జరిగినా అంతే..
Google Search
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 31, 2022 | 8:08 AM

నేటి ఆధునిక యుగంలో దాదాపు ప్రతి వ్యక్తి టెక్ ఫ్రెండ్లీగా మారుతున్నారు. మనకు ఏం కావాలన్నా ఓ సారి గూగుల్‌ను అడుగుతున్నారు. ఇంటి అడ్రస్ నుంచి మొదలు భోజనం ఎక్కడ చేయాలో కూడా గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అన్నింటికి గూగుల్‌పైనే ఆదారపడుతున్నారు నేటి తరం యువత. ఇంట్లో ఏ చిన్న పని కావాలన్నా స్మార్ట్ ఫోన్ తీసుకోవడం అందులో సెర్చ్ చేయడం. మన ఇంటి పక్కన ఉండే షాప్‌లో ఏం దొరికే వస్తువుల కోసం కూడా గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. ఏదైనా సంస్థ, దుకాణం లేదా ఏదైనా సేవ కోసం గూగుల్‌లో నంబర్‌ కోసం సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ సెర్చ్ చేయడం అదులో లభించే నెంబర్లకు కాల్ చేయడం అలవాటుగా మార్చుకుంటున్నారు. గూగుల్‌లో కనిపించే నెంబర్ ఎంత వరకు సరైన నెంబర్ అనేది కూడా ఆలోచించకుండా కాల్ చేస్తున్నారు. అయితే ఈ అలవాటు మంచిది కాదని టెక్నికల్ నిపుణులు హెచ్చరిస్తున్నా.. మనం మాత్రం మారడం లేదు. నకిలీ నంబర్‌పై ఆధారపడటం ద్వారా మీరు మోసానికి గురవుతారు. అచ్చు ఇలాంటి ఘటనే ఒకటి ముంబైలో జరిగింది. గూగుల్ సెర్చ్‌కు సంబంధించి ముంబైలో షాకింగ్ కేసు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ముంబైలో షాకింగ్ కేసు

ముంబైలోని 49 ఏళ్ల మహిళ ఫుడ్ డెలివరీ యాప్ నుంచి ఏదైనా ఆర్డర్ చేయాలనుకుంది. ఆర్డర్ ఇచ్చేందుకు పలుమార్లు రూ.1000 చెల్లించింది. మహిళ చెల్లింపు మళ్లీ మళ్లీ ఫెయిల్ అయ్యింది. దీంతో ఆ మహిళ విసిగిపోయి సంబంధిత షాపు నంబర్‌ను గూగుల్‌లో సెర్చ్ చేసింది. 

మోసానికి గురైన మహిళ

నంబర్ వచ్చిన తర్వాత ఆ మహిళ డబ్బు చెల్లించాలని ఫోన్ చేసింది. కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఆమె చెల్లించిన క్రెడిట్ కార్డ్ వివరాలను అడిగాడు. అంతేకాదు ఆ మహిళ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ నంబర్‌ను కూడా సదరు వ్యక్తి అడిగాడు. అప్పటికే ఆర్డర్ బుక్ కాలేదనన్న ఆందోళనలో ఉన్న ఆ మహిళ.. అతను అడుగున్న ప్రశ్నలను అర్థం చేసుకోలేక ఓటీపీని షేర్ చేసింది. ఓటీపీ షేర్ చేసిన వెంటనే మహిళ బ్యాంకు ఖాతా నుంచి రూ.2,40,310 కట్‌ అయింది.

అసలు సంగతి గుర్తించిన మహిళ..

ఈ విషయాన్ని మహిళ పోలీసులకు చెప్పింది. అదృష్టవశాత్తూ మహిళ వెంటనే అలర్ట్ అవడంతో పెద్ద మోసం నుంచి తప్పించుకుంది. మోసం చేస్తున్న వ్యక్తి నుంచి రూ.2,27,205 రివర్స్ తెప్పించగలిగారు. ఈ ఘటన తర్వాత నెటిజన్లను పోలీసులు హెచ్చరించారు. Googleలో కనిపించిన అన్ని ఫోన్ నంబర్లు ప్రామాణికమైనవి కావు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. షాప్ అధికారిక వెబ్‌సైట్ నుంచి కస్టమర్ కేర్ నంబర్ లేదా సంప్రదింపు వివరాలను ఉపయోగించడం మాత్రమే పరిష్కారం అని వారు తెలిపారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం