అంబులెన్స్‌పై AMBULANCE అనే అక్షరాలు తిరగరాసి ఉంటాయి ఎందుకు..?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీ అత్యుత్సహం కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ..

అంబులెన్స్‌పై AMBULANCE అనే అక్షరాలు తిరగరాసి ఉంటాయి ఎందుకు..?
Ambulance
Follow us

|

Updated on: Oct 31, 2022 | 7:38 AM

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీ అత్యుత్సహం కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. ప్రతి విషయాలలో దానికి అర్థాలు తప్పనిసరి ఉంటాయి. సాధారణంగా అంబులెన్స్‌పై ఇంగ్లీష్‌లో అక్షరాలు తిరగరాసి ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా గమనించారా..? అందుకు కారణం లేకపోలేదు. మరి అంబులెన్స్‌పై అక్షరాలు ఎందుకు తిరగరాసి ఉంటాయో తెలుసుకోండి.

అంబులెన్స్‌ వాహనం ప్రమాద స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లే వాహనం. రోగిని ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్లగలిగితే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఈ వాహనానికి ట్రాఫిక్‌ అవాంతరాలు ఏర్పడకుండా రోడ్డు మీద అందరినీ అప్రమత్తం చేయడానికి మూడు విధానాలు పాటిస్తారు.

ఒకటి: ప్రత్యేకంగా శబ్దం వచ్చే సైరన్‌ మోగించడం. రెండు: రాత్రయినా, పగలైనా బాగా కనిపించేలా ప్రత్యేకమైన ఎరుపు, నీలం రంగుల్లో తిరిగే లైటును వాహనం పైన ఏర్పాటు చేస్తారు. మూడు: అంబులెన్స్‌ వాహనం మీద అక్షరాలను దానికి ముందున్న వాహనదారులు గుర్తించేలా రాయడం. రోడ్డు మీద వాహనాల డ్రైవర్లందరూ తమ వెనుక ఏయే వాహనాలు వస్తున్నాయో తెలుసుకోడానికి ‘రియర్‌ వ్యూ మిర్రర్‌’ అనే చిన్న అద్దమొకటి ఉపయోగపడుతుంది. దీని ద్వారా చూసినప్పుడు అంబులెన్స్‌ వాహనం మీద రాసిన అక్షరాలు సరిగా కనబడాలంటే వాటిని తిరగేసి రాయాలి. అందుకే అలా రాస్తారు. దీని వల్ల ముందున్న వాహనదారులు గమనించి అంబులెన్స్‌కు దారి ఇస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి