AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Komatireddy Venkat Reddy: భాష జాగ్రత్త.. కేటీఆర్‌ కామెంట్స్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్ట్రాంగ్‌ రియాక్షన్‌..

కాంట్రాక్టుల కోసమే అన్నదమ్ములు ఆటలాడుతున్నారంటూ కేటీఆర్‌ చేసిన ఆరోపణల్ని ఖండించారు వెంకట్‌రెడ్డి. ఇప్పటికీ కిరాయి ఇంట్లోనే ఉంటున్నానని చెప్పారు.

Komatireddy Venkat Reddy: భాష జాగ్రత్త.. కేటీఆర్‌ కామెంట్స్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్ట్రాంగ్‌ రియాక్షన్‌..
Komatireddy Venkatreddy
Shaik Madar Saheb
|

Updated on: Oct 11, 2022 | 5:04 PM

Share

తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ నీ భాష జాగ్రత్త.. నిజాయితీతో నిప్పులా బతికాను.. మీ కుటుంబంలా కమిషన్లతో కాదని విమర్శించారు. తమ గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలంటూ కోమటిరెడ్డి హెచ్చరించారు. అవినీతి చిట్టా మొత్తం తన వద్ద ఉందని.. తన జోలికి వస్తే అవినీతి చిట్టా మొత్తం విప్పుతానంటూ హెచ్చరించారు. ఈ మేరకు కోమటి రెడ్డి వెంకటరెడ్డి ప్రకటన విడుదల చేయడంతోపాటు.. టీవీ9 తో ప్రత్యేకంగా మాట్లాడారు. కోమటిరెడ్డి కాదు.. కోవర్టు బ్రదర్స్‌ అంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌పై వెంకట్‌రెడ్డి ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించారు. కేటీఆర్‌ వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని, భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోటీ రాజగోపాల్‌రెడ్డితో అయితే.. తననెందుకు లాగుతున్నారంటూ ఫైర్ అయ్యారు. కోవర్ట్‌ బద్రర్స్‌ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోవాలని డిమాండ్ చేశారు. తనలాంటి ఉద్యమకారుడిపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదంటూ సూచించారు.

కాంట్రాక్టుల కోసమే అన్నదమ్ములు ఆటలాడుతున్నారంటూ కేటీఆర్‌ చేసిన ఆరోపణల్ని ఖండించారు వెంకట్‌రెడ్డి. ఇప్పటికీ కిరాయి ఇంట్లోనే ఉంటున్నానని చెప్పారు. కేటీఆర్‌ ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోనని హెచ్చరించారు.

మంత్రి జగదీశ్‌రెడ్డిపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వెంకట్‌రెడ్డి. బస్సు చార్జీకి డబ్బుల్లేని జగదీశ్‌రెడ్డికి.. వేలకోట్ల ఆస్తులు ఎక్కణ్నుంచి వచ్చాయో చెప్పాలన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..