Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో 48 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్.. పూర్తి వివరాలు
ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ నుంచి నీటి సరఫరా చేసే 800 ఎంఎం డయా పైప్‌లైన్ అత్యవసర మరమ్మత్తు పనులు చేపడుతున్నందున రానున్న 48 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో
హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ, జలమండలి కీలక సూచనలు చేసింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ నుంచి నీటి సరఫరా చేసే 800 ఎంఎం డయా పైప్‌లైన్ అత్యవసర మరమ్మత్తు పనులు చేపడుతున్నందున రానున్న 48 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు జలమండలి అధికారులు తెలియజేశారు. జలమండలి డివిజన్ 3, 4, 5ల పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని.. సహకరించాలని కోరింది.
తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనున్న ప్రాంతాలు ఇవే..
ఖైరతాబాద్, గోషామహాల్, నాంపల్లి నియోజకవర్గాల్లోని సయ్యద్ నగర్, అహ్మద్ నగర్, చింతల్ బస్తీ, ఏసీ గార్డ్స్, విజయనగర్ కాలనీ, అంజుమన్, శ్యామ్ నగర్, కిషన్ నగర్, దత్తాత్రేయ కాలనీ, ఇందిరా నగర్, వడ్డెర బస్తీ, రెడ్ హిల్స్, ఖైరతాబాద్, మల్లేపల్లి, అఘాపురా, నాంపల్లి, బజార్‌ఘట్, ఆదర్శ్ నగర్, గన్‌ఫౌండ్రీ, చిరాగ్ అలీ, ఆబిడ్స్, గోడేకి ఖబర్, సీతారాం బాగ్, జంగం బస్తీ ప్రాంతాల్లో 48 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని ప్రకటనలో తెలిపింది.
కావున, నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు. మరమ్మతు పనులు అయిన వెంటనే తాగు నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..