Munugode Bypoll: 18 వేల కోట్ల కోసమే మునుగోడు ఉపఎన్నిక.. రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సెన్సేషన్ కామెంట్స్..
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ కలిసిపోయాయన్నారు మంత్రి కేటీఆర్. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కోవర్ట్ బ్రదర్స్‌గా అభివర్ణించారు. తమ్ముడు బీజేపీ తరపున..
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ కలిసిపోయాయన్నారు మంత్రి కేటీఆర్. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కోవర్ట్ బ్రదర్స్‌గా అభివర్ణించారు. తమ్ముడు బీజేపీ తరపున పోటీలో ఉంటే.. కాంగ్రెస్ ఎంపీగా ఉన్న అన్నయ్య ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్తున్నారని విమర్శించారు. కోమటిరెడ్డి బద్రర్స్ కోవర్టులు అనేదానికి.. ఇంతకంటే నిదర్శన ఇంకేం కావాలన్నారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్‌గా సీరియస్ అయ్యారు.
ఒక కాంట్రాక్టర్ అహంతో మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం ఉప ఎన్నిక వచ్చిందన్నారు. తమ మంత్రి జగదీశ్ రెడ్డి ఛాలెంజ్‌కు కట్టుబడి ఉన్నామని, మునుగోడుకు కేంద్రం రూ.18 వేల కోట్ల నిధులు ఇస్తే ఉప ఎన్నిక నుండి తప్పుకుంటామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చెప్తున్నానని అన్నారు. మునుగోడు అభివృద్ధికి నిధులు కావాలని కేటీఆర్ సైతం డిమాండ్ చేశారు. ఒక్క సీటుతో వచ్చేది లేదు పోయేది లేదని పేర్కొన్నారు. వేల కోట్లతో మునుగోడులో అంగడి సరుకులా ఓట్లను కొనాలని చూస్తున్నారంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్.
నల్గొండ జిల్లాలో ఫ్లోరిసిస్ ప్రకృతి సమస్య కాదన్న ఆయన.. ఫ్లోరైడ్‌పై సీఎం కేసీఆర్ స్వయంగా పాటలు రాశారని గుర్తు చేశారు. సావానైనా సస్తాం కానీ మోడీకి మాత్రం లొంగేది లేదని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల అంశంపై.. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు చేయకపోతే కాంట్రాక్టును వదులుకోవాలని, లేదంటే భాగ్యలక్ష్మి ఆలయానికి గానీ, తాము కట్టిన యాదాద్రి ఆలయానికి రావాలని సవాల్ విసిరారు మంత్రి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..