Munugodu By-Poll: ఆ సొమ్ము పేదలకు పంచిపెడతాం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
టీఆరెఎస్ నేతల అవినీతి సొమ్మును పేదలకు పంచి పెడతామన్నారు. కారు పార్టీ నాయకుల అవినీతిని వెలికి తీసే బాధ్యత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీసుకుంటారన్నారు రాజగోపాల్ రెడ్డి. టీఆరెఎస్ నాయకులే అవినీతి సొమ్ముతో..
తెలంగాణలోని మునుగోడు శాసనసభా స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీలు, అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీఆర్ ఎస్ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేస్తుంటే.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి టీఆర్ ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం వచ్చిన ఉప ఎన్నికల ఇదని టీఆర్ ఎస్ ప్రచారం చేస్తుంటే దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన కుమారుడికి నిబంధనల ప్రకారం వచ్చిన కాంట్రాక్టుపై మంత్రి జగదీశ్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన టీవీ9తో మాట్లాడుతూ.. టీఆర్ ఎస్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాల్సిన అవరం లేదని, డిపాజిట్ రాకుండా ప్రజలే చేస్తారన్నారు. టీఆర్ ఎస్ నుంచి కాకుండా కొత్త పార్టీ బీఆర్ ఎస్ నుంచి పోటీచేయాలని సవాల్ విసిరారు. అవినీతికి పాల్పడిన టీఆరెఎస్ నాయకులు జైలుకు వెళ్ళడం ఖాయమని జోస్యం చెప్పారు.
టీఆరెఎస్ నేతల అవినీతి సొమ్మును పేదలకు పంచి పెడతామన్నారు. కారు పార్టీ నాయకుల అవినీతిని వెలికి తీసే బాధ్యత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీసుకుంటారన్నారు రాజగోపాల్ రెడ్డి. టీఆరెఎస్ నాయకులే అవినీతి సొమ్ముతో మునుగోడులో ఓట్ల కొనుగోలుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక తన కుమారుడికి వచ్చిన టెండర్ పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కోట్లు ఖర్చు చేసినా మునుగోడులో టీఆరెఎస్ కు డిపాజిట్ రాదని జోస్యం చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయినప్పటినుంచి టీఆర్ ఎస్, బీజేపీ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటుండటంతో పాటు, సవాలు ప్రతి సవాలు విసురుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం మునుగోడు ప్రజల మద్దతు తమకే అంటూ టీఆర్ ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మొత్తం మీద ఈ మాటల యుద్ధం ఎన్నిక పోలింగ్ సమయానికి ఎటువైపునకు దారితీస్తుందో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..