Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: హైదరాబాద్‎లో ఏపీకి కేటాయించిన భవనాలపై సీఎం రేవంత్ దృష్టి.. అధికారులతో కీలక చర్చ..

జూన్‌2కి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్. హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలు ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈనెల 18న జరిగే కేబినెట్ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించనున్నారు. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Telangana: హైదరాబాద్‎లో ఏపీకి కేటాయించిన భవనాలపై సీఎం రేవంత్ దృష్టి.. అధికారులతో కీలక చర్చ..
Cm Revanth Reddy
Follow us
Prabhakar M

| Edited By: Srikar T

Updated on: May 16, 2024 | 10:40 AM

జూన్‌2కి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్. హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలు ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈనెల 18న జరిగే కేబినెట్ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించనున్నారు. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో ముఖ్యమంత్రి ప్రజా పాలనపై దృష్టి కేంద్రీకరించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సీఎం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూలు 9, షెడ్యూలు 10 లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాకపోవడం.. విద్యుత్తు సంస్థల బకాయిలు ఇంకా తేలకపోవడం వాటి వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీటిపై చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.

రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి అంశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని, పీటముడి పడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జూన్‌ 2తో పదేండ్లు పూర్తవనుండటంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. ఈ పదేండ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత రాష్ట్ర అధీనంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇక పునర్విభజన చట్ట ప్రకారం పెండింగ్లో ఉన్న అంశాలు, ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఈ నెల 18న జరిగే రాష్ట్ర కేబినేట్ సమావేశంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీతో పీటముడిగా ఉన్న అంశాలను చర్చించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…