AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ కీలక సమావేశం.. తొలిసారి చర్చించే అవశాలివే..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఆదివారం డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో మాట్లాడనున్నారు. గత ప్రభుత్వ లోపాలను అరికట్టడంతో పాటు.. తమ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యాంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే 'ప్రజా పాలన' కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు.

CM Revanth Reddy: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ కీలక సమావేశం.. తొలిసారి చర్చించే అవశాలివే..
Telangana Cm Revanth Reddy
Ashok Bheemanapalli
| Edited By: Srikar T|

Updated on: Dec 23, 2023 | 9:18 PM

Share

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఆదివారం డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో మాట్లాడనున్నారు. గత ప్రభుత్వ లోపాలను అరికట్టడంతో పాటు.. తమ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యాంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే ‘ప్రజా పాలన’ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ ముందుకు సాగుతున్నారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే హైదరాబాద్‎లోని మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్‎లో ప్రతి మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఈ కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ ప్రకటించనున్నారు. దీనితోపాటు, ఆర్థిక సాధికారిత కల్పించడం ద్వారా సామాజిక న్యాయం అందించే ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు.

నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్లేందుకై ప్రభుత్వ పనితీరును మరింత మెరుగు పర్చడం, జవాబుదారిగా ఉండేందుకై ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఆహ్వానించారు. డిసెంబర్ 28వ తేదీ నుండి 2024 జనవరి 6వ తేదీ వరకు (సెలవు రోజులు మినహాయించి మొత్తం 8 పనిదినాలు) ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలనుండి సాయంత్రం 6 గంటలవరకు ఈ ప్రజా పాలన గ్రామ సభలు నిర్వహిస్తారు. అన్ని గ్రామ పంచాయితీలు, మున్సిపల్ వార్డులలో రోజుకు రెండు చొప్పున సభలు నిర్వహించేందుకు కార్యచరణ సిద్ద చేస్తున్నారు. అలాగే ప్రతి రోజు అధికారులతో కూడిన బృందాలు అయా ప్రాంతాల్లో పర్యటిస్తాయన్నారు.

ఈ ప్రజాపాలన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్/ కార్పొరేటర్/ కౌన్సిలర్‎లను ఆహ్వానించడంతోపాటు సంబంధిత ప్రజా ప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించడానికి ఒక్కోదానికి ఒక్కొక్క ప్రత్యేకమైన రిజిస్టర్ నెంబర్ ఇవ్వడంతో పాటు వాటిని కంప్యూటరైజ్ చేస్తారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..