AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్దిపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి.. 13 దేశాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం..

హైదరాబాద్‎లోని కుతుబ్ షాహీ టూంబ్ వద్ద బుధవారం రాత్రి 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జయేష్ రంజన్, హైదరాబాద్ రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ స్నేహజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్దిపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి.. 13 దేశాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం..
Cm Revanth Reddy
Srikar T
|

Updated on: Jan 11, 2024 | 7:16 AM

Share

హైదరాబాద్‎లోని కుతుబ్ షాహీ టూంబ్ వద్ద బుధవారం రాత్రి 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జయేష్ రంజన్, హైదరాబాద్ రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ స్నేహజ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక , బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు.

అభయహస్తం కింద అన్ని వర్గాల అభ్యున్నతికి నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర సమర యోధులు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నేతల ఆశయాలను, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, పారదర్శకత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని దేశాలలో సత్సంబంధాలు కొనసాగించటానికి తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో ప్రయత్నిస్తుందని తెలిపారు. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేయుటకు ముందుకు రావాలని కోరారు. అందుకు తగిన సూచనలు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..